సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం..ఇక్కడకి వస్తే స్వర్గసుఖాలు అనుభవించవచ్చు.  ఇలాంటి కలలు కంటూ ఎంతో మంది తమ జీవితంలో ఒక్కసారైనా వెండి తెరపై కనిపించాలన్న కోరికతో ఉంటారు.  ముఖ్యంగా అమ్మాలయి విషయంలో అయితే మరీ ఘోరం...వారికి సినిమా చాన్సులు ఇప్పిస్తామని తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడమే కాకుండా వారిని బెదిరించి పడుపు వృత్తిలోకి నెట్టిన సంఘటనలు కోకొల్లు.   ఆ మద్య మళియాళ నటి భావన పై ఆమె కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే.  


పడక సుఖం అందిస్తే..మంచి చాన్సులిస్తా..!

ఈ విషయంపై భావనకి మాళీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీలు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించాయి.  మొత్తానికి ఈ కేసులో నింధితులకు జైలు శిక్షపడింది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు తమకు జరిగిన లైంగిక ఇబ్బందుల గురించి గళం విప్పుతూ వచ్చారు.  ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, రెజీనా,కాజల్ లాంటి హీరోయిన్ల తమపై జరిగిన లైంగిక వేదింపుల గురించి ప్రస్తావించారు. ఆ మద్య సినిమాల్లో ఛాన్స్ లు కావాలంటే బెడ్ మీదకు రావలసిందే అని హీరో దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు అందరూ అడుగుతారని బాంబ్ పేల్చింది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి.


పడక సుఖం అందిస్తే..మంచి చాన్సులిస్తా..!

తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవం జరిగినట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ లో వస్తున్న శ్రద్దాదాస్ నన్ను కూడా కొంతమంది దర్శక నిర్మాతలు పక్కలోకి రమ్మన్నారని , ఆ సుఖం అందిస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తామని అన్నారని కానీ నేను మాత్రం ఎవ్వరికి లొంగలేదని అంటోంది. ఈ భామ కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చిన సమయంలో కొంత మంది దర్శక నిర్మాతలు ఆ సుఖం అందించ మన్నారట..లేదంటే అసలు ఇండస్ట్రీలో నీకు ప్లేస్ లేకుండా చేస్తామని బెదిరించారట.  

పడక సుఖం అందిస్తే..మంచి చాన్సులిస్తా..!

ఆ ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి ఎవరికీ లొంగలేదు కాబట్టి పెద్ద పెద్ద సినిమాలు అన్ని మిస్ అయ్యానని అంటోంది.  సినిమాల్లో నటించాలని ఎంతో తపన ఉన్న కొంత మంది యువతులను ఆలాంటి దుర్మార్గులు మభ్య పెట్టి లైంగిక వాంఛలు తీర్చుకుంటారని అప్పుడే మనమేంటో.. మన ధైర్యం ఏంటో చూపించాలని కూడా హితువు చెబుతోంది శ్రద్దా దాస్ .

మరింత సమాచారం తెలుసుకోండి: