తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ లో ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు.  గత వారం మాత్రం డబుల్ ధమాకా అని కత్తి మహేష్, సింగర్ కల్పన ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.  బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో బాగా ఎంట్రటైన్ మెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్ సభ్యులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెడుతూ.. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు.  
Bigg Boss Telugu Updates: Mumaith Khan gets eliminated this week; Jr NTR gives Navdeep a taste of his own medicine
ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ముగ్గురిలో శనివారం హరితేజను సేఫ్ జోన్‌లోకి పంపిన ఎన్టీఆర్ ఆదివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.  బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ ఇంటి సభ్యుల గురించి వారి తప్పుల గురించి మాట్లాడింది.   ఈ కార్యక్రమం అయిపోగానే ముమైత్‌కు ఎన్టీఆర్ ఓ బిగ్ బాంబ్ ఇచ్చారు. ఆమె దాన్ని శివ బాలాజీపై వేశారు. ఇంతకీ ఆ బిగ్ బాంబ్ ఏంటంటే.. శివ బాలాజీ ఇకపై ఏం మాట్లాడలనుకున్నా ముందు ‘ము.. ము.. ము.. ము.. ము..’ అంటే ‘ము’ని ఐదుసార్లు చెప్పిన తరవాతే మాట్లాడాలి.  

ఇక శివబాలాజీ కూడా తాను మాట్లాడే ముందు ‘ము.. ము.. ము.. ము.. ము..’అంటూ మాట్లాడి నవ్వించారు. అంతా అయిపోయింది..ముమైత్ ఖాన్ వెళ్లి పోవడానికి సిద్దంగా ఉంది..అప్పుడు ఎన్టీఆర్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. ముమైత్ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ కావట్లేదని ప్రకటించారు. వాస్తవానికి ముమైత్ ఖాన్ ముమైత్ తనను తాను ఎలిమినేషన్‌కు నామినేట్ చేసుకోవడం వల్ల ప్రేక్షకులు ఆమెకు అత్యధికంగా ఓట్లు వేసినట్లు బిగ్ బాస్ భావించారని ఎన్టీఆర్ చెప్పారు. ఒకవేళ తాను నామినేట్ చేసుకోకపోయి ఉంటే అసలు ఎలిమినేషన్ ఓటింగ్‌లో ఉండేదే కాదని చెప్పారు.  
Image result for telugu bigg boss show
అందుకోసమే ముమైత్ కి మరోచాన్స్ వచ్చింది..కాకపోతే ఆమె నేరుగా హౌజ్‌మేట్స్ దగ్గరకి కాకుండా ఓ సీక్రెట్ రూంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి హౌజ్‌లోకి ఎప్పుడు వెళ్తారు.. ఎలా వెళ్తారు అనేది బిగ్ బాస్ చేతులోనే ఉంది.   ఒంటరిగా ఉంచి కొన్ని టాస్క్‌లతో మెప్పిస్తే మళ్ళీ హౌస్లోకి వస్తుందన్నమాట. ఏదేమైనా గాంగ్‌లో ముమైత్ మరీ ఆశించిన సందడి చేయకున్నా లాంగ్వేజ్ ఇబ్బందివున్నా హౌస్‌కు అట్రాక్షన్ అయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: