మెగాస్టార్ చిరంజీవి త‌న కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు త‌న 151వ సినిమాకు రెడీ అవుతున్నాడు. తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

chiranjeevi 151 film కోసం చిత్ర ఫలితం

స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే టైటిలే పెడ‌తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం టైటిల్ అది కాదని, మరో కొత్త టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు టాక్‌. ఈ ప్ర‌ముఖ హిస్టారిక‌ల్ సినిమాకు  ‘సై రా’ అనే రెండు అక్షరాల ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ కొత్త టైటిల్‌పై కొణిదల ప్రొడక్షన్స్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఇక ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌ర్నూలు జిల్లాలోని ఉయ్యాల‌వాడ ప్రాంతాన్ని బేస్ చేసుకుని బ్రిటీష్ వాళ్ల‌పై పోరాటం చేశారు. ఆయ‌న్ను ప‌క్కా స్కెచ్‌తో బ్రిటీష్ వాళ్లు చంపేసినా ఆయ‌న నింపిన స్ఫూర్తి ఈ నాటికి సీమ ప్రాంతాల్లో అలాగే ఉంది. 

chiranjeevi 151 film కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: