మెగా అభిమానులు ఈరోజు జరగబోతున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ మోషన్ పోస్టర్ గురించి అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తుంటే ఈరోజు తన పుట్టినరోజునాడు చిరంజీవి తనఅభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు అనివార్తలు వస్తున్నాయి. ఒక భారీ చారిత్రాత్మక కథను తీసుకుని ‘బాహుబలి’ స్థాయిలో చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ గా కనిపించడానికి భారీ కసరత్తులు చేసినవిషయం తెలిసిందే. మరి కొద్ది గంటలలో చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్న ఈమూవీ టైటిల్ విషయంలో ఎవరూ ఊహించని షాకింగ్ నిర్ణయం చిరంజీవి తీసుకున్నట్లు టాక్. 

‘ఉయ్యాలవాడ’ కథకు ‘సై రా’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ భాషలలో ఈసినిమాను ఒకేసారి విడుదల చేస్తున్న నేపధ్యంలో ఈ మూవీ టైటిల్ అన్ని భాషల ప్రజలకు అర్ధం అయ్యే రీతిలో ఈమూవీకి ఈ టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ ఆఫీసులో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ పేరుమీద రిజిష్టర్ చేసినట్లు కూడ తెలుస్తోంది. 

ఇటీవల సింపుల్ గా ఈసినిమాకు సంబంధించి సింపుల్ గా పూజా కార్యక్రమాలను తో మొదలు పెట్టిన రామ్ చరణ్ ఈరోజు జరుగుతున్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను చిరు మంగళవారం తన పుట్టినరోజు సందర్బంగా "ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి" మోషన్ పోస్టర్ ని ఉదయం 11.30 నిముషాలకు అత్యంత ఘనంగా రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చేతులమీదుగా ఈ చిత్రంలోని అన్ని పాత్రలను స్కెచ్ తో వేసిన చిత్రాలను కూడ విడుదల చేస్తారని తెలుస్తోంది. 

ఈ వేడుక గచ్చిబౌలి లోని సంధ్యా కన్వెన్షన్ లో భారీ స్థాయిలో అట్టహాసంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాలో ఎవరెవరు  ఏ తరహా పాత్రలు చేస్తున్నారు అలాగే ఈ చిత్రానికి పనిచేయబోయే పూర్తి యూనిట్ సభ్యుల వివరాలను కూడ నేటి కార్యక్రమంలో చరణ్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. అదేవిధంగా ఈసినిమాకు సంబంధించి గత కొంత కాలంగా హడావిడి చేస్తున్న రూమర్స్ అన్నింటికి చరణ్ ఈరోజు జరిగే మీడియా సమావేశంలో క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ఈసినిమాకు 150 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ ఈసినిమాకు చేయతలపెట్టిన  భారీ గ్రాఫిక్స్ తో ఈసినిమా బడ్జెట్ మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దాదాపు 9 సంవత్సరాలపాటు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయ నాయకుడుగా ప్రజల తిరస్కారానికి గురి కాబడినా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను పొందిన చిరంజీవి మెగా అభిమానుల హృదయాలలో ‘ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవి’ అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: