అక్కినేని యువ హీరో అఖిల్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయాలని నాగార్జున ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కోరిక తీరకపోయినా నాగార్జున కోరిక మరో విధంగా తీర్చాడు రాజమౌళి. గత రెండు మూడు రోజులుగా అఖిల్ లేటెస్ట్ సినిమా టైటిల్ గురించి నాగార్జున అఖిల్ నాగచైతన్య సమంతలు లీక్ లు ఇస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను అధికారికంగా రాజమౌళి ప్రకటించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వినూత్నమైన రీతిలో టైటిల్ ప్రకటన చేశారు. ఎన్టీఆర్, కాజల్, ప్రభాస్, శృతి హాసన్, నాగ చైతన్య, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సమంత, సూర్య, నాని, వెంకటేష్, రాజమౌళి, రకుల్ ప్రీత్, రానా, నాగార్జున ఇలా అంతా కలిసి 'హలో' చెబుతూ టైటిల్ ప్రకటించారు. 

ఆశ్చర్యకరంగా ఈమూవీ టైటిల్ కూడ ‘హలో’ కావడం ఇందులోని ట్విస్ట్. ఈ టైటిల్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నట్లు అఖిల్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈసినిమా పై భారీ అంచనాలు అఖిల్ పెట్టుకున్న నేపధ్యంలో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ టైటిల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మళయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న నేపధ్యం తెలిసిందే. ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఈసినిమా నాగార్జునకు ఇప్పటి వరకు కలిసి వచ్చిన డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కాబోతోంది. 

నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీస్తున్న ఈమూవీ పై అత్యంత భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మరిచిపోలేని విజయాన్ని అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ ను టాప్ యంగ్ హీరోగా తీర్చి దిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని నాగార్జున అభిమానులు కోరుకుంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: