కొంతమంది డైరెక్టర్ లకి ఒక అలవాటు ఉంది . అది మంచి అలవాటా చెడ్డ అలవాటా అనేది చెప్పలేము కానీ ఒక సినిమా లో వేరే సినిమాల గురించీ హీరోల గురించీ డైరెక్టర్ ల గురించీ పంచ్ లు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీను వైట్ల , బోయపాటి శ్రీను లకి ఈ అలవాటు చాలా ఎక్కువగా ఉంది. శ్రీను వైట్ల ఫన్ కోసం అలాంటివి పెడితే బోయపాటి శ్రీను 'బురద జాతి' అంటూ సీరియస్ గానే పెడతారు.


ఎవ్వరినీ ఉద్దేశించినవి కావు అని చెబుతారు కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరిమీద ఆ పంచ్ పడితీరుతుంది. ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా అలాంటి పనే చేస్తున్నాడు అని టాక్ ఫిలిం నగర్ లో వినపడుతోంది.


పైసావసూల్ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి మీద కొన్ని మెగా పంచ్ లు వెయ్యబోతున్నాడు బాలయ్య, దీనికోసం పనిగట్టుకుని బాలయ్య క్యారెక్టర్ కోసం పూరీ డైలాగులు రాసారట. బాలయ్య కానీ ఆలీ క్యారెక్టర్ కానీ ఈ పంచ్ లు వెయ్యబోతున్నారు అని తెలుస్తోంది.


పూరీ - చిరు లు ఇద్దరూ 150వ సినిమాను చేస్తారని ముందుగా ప్రకటించినా.. తరువాత ఆ సినిమాను చేయడంలేదని.. సెకండాఫ్ బాగాలేదని మీడియా ముఖంగా చెప్పేశారు మెగాస్టార్.  ఈ విషయం ఎప్పటి నుంచో మనసులో పెట్టుకున్న పూరీ జగన్నాథ్ చిరు కి సూపర్ సెటైర్ లు సిద్దం చేసాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: