హీరోయిన్ గా తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న హీరోయిన్ ఇలియానా కి బాలీవుడ్ లో కూడా పరవాలేదు అన్నట్టు గా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా అక్కడ పెద్దగా రాణించక పోయినా ఎప్పుడూ న్యూస్ లో ఉంటూ ఉండేది ఆమె. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల ఫొటోగ్రాఫర్ అండ్ర్యూ నీబోస్ తో సహజీవనం చేస్తోంది. ఒక మాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చిన ఇలియానా ఆండ్రూ తనకి చాలా దగ్గరైన వ్యక్తి అనీ ఇద్దరూ ప్రస్తుతం సహజీవనం లో ఉన్నాం అనీ చెప్పుకొచ్చింది. పెళ్ళికీ సహజీవనానికీ మధ్యన చాల తేడా ఉంది అంటోంది ఆమె. పెళ్లి అయిపోయిన తరవాత ఆనందం అనేది ఎక్కువగా ఉండదు కానీ సహజీవనం లో ఆ ఆనందం ఉంటుంది అంటోంది ఇలియానా. సినిమా పరిశ్రమ లో 11 సంవత్సరాలు గా కొనసాగుతున్న తాను అకారణంగా వ్యతిరేకత ని సంపాదించుకున్నా అంటోంది. తాము చేసే వ్యాఖ్యలు కూడా కొన్ని సార్లు వివాదాస్పదం అవుతుంటాయని... ఇలాంటి ఇబ్బందుల్లోకి ఆండ్ర్యూని లాగడం తనకు ఇష్టం లేదని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: