యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన స్థాయిని చాల పెద్దగా ఊహించుకుంటూ ఎవరికీ అర్ధంకాని వ్యక్తిగా మారుతున్నాడు అంటూ ఈ యంగ్ హీరో పై ఘాటైన సెటైర్లు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్నాయి. ఈవారం విడుదల కాబోతున్న అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈసినిమాలో బూతు పదాలు ఉన్నాయి అన్నది ఓపెన్ సీక్రెట్ గా మారింది. యూట్యూబ్ లో సెన్సార్ ఉండదు కాబట్టి ఈసినిమా టీజర్ ను అప్ లోడ్ చేసినా ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. అయితే సినిమాలకు సెన్సార్ బోర్డ్ ఉంటుంది అన్న విషయం కూడ ఈయంగ్ హీరోకు తెలియదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
ఈమూవీలోని కొన్ని బూతు పదాలను సెన్సార్ బోర్డు కత్తెర వేసి వాటి స్థానంలో మ్యూట్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం లేదు.

ధియేటర్లలో ఆ బూతు పదాల సీన్స్ వచ్చినప్పుడు తన బదులు ఆ డైలాగ్స్ ను ప్రేక్షకులను చెప్పమని అంటూ విజయ్ దేవరకొండ యూత్ ను రెచ్చగొట్టడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. సెన్సార్ బోర్డ్ సభ్యులు తన సినిమాకు ‘ఎ’ సర్టిఫికేట్ ఇవ్వడం ఈ యంగ్ హీరోకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. ఈసినిమా కథ విన్నప్పుడే ఇది పిల్లల కథ కాదు అని తనకు అనిపించింది అని చెపుతున్న ఈ యంగ్ హీరో తన సినిమాలోని డైలాగ్స్ ను తొలిగించే అధికారం సెన్సార్ బోర్డ్ కు అధికారం ఎక్కడ ఉంది అని అర్ధం విధంగా కామెంట్స్ చేస్తున్నాడు. 

ముఖ్యంగా “ఏం మాట్లాడుతున్నావ్ రా“ అనే డైలాగ్ దగ్గర చివర వచ్చే  బూతు పదాన్ని మ్యూట్ చేయడం ఈ యంగ్ హీరోకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. దీనితో టాప్ యంగ్ హీరోలు అంతా తమ అభిమానులు సభ్యతగా సంస్కారంతో ఉండాలి అని స్పీచ్ లు ఇస్తూ ఉంటే పట్టుమని కనీసం 5  సినిమాలలో కూడా నటించని ఈ యంగ్ హీరో ఓవర్ యాక్షన్ ఏమిటి అంటూ చాలామంది కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: