బాలీవుడ్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చే పేర్లు .. ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్. అయితే తం ముగ్గురిని మాత్రమే స్టార్ లు గా పిలవడం వారినే గొప్ప హీరోలుగా కొలవడం పట్ల ఆమిర్ ఖాన్ ఆక్షేపణ చెబుతున్నాడు.


బాలీవుడ్ లో మేమేనా స్టార్లు? ఇంకెవరూ లేరా అంటూ సీరియస్ అయ్యారు ఆమిర్ ఖాన్. ఇండస్ట్రీలో నైపుణ్యం ఉన్న ఎందరో స్టార్లు ఉన్నారని, వారు తమ నటనతో ఎంతో పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నారని వివరించాడు.


ఈ సందర్భంగా అక్షయ్ కుమార్‌ను ఉదహరించాడు. " అక్షయ్ కొత్త సినిమా టాయిలెట్ అద్భుతంగా ఉంది. ఆ సినిమాకి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు " అని ఆమిర్ పేర్కొన్నాడు. ప్రతీ సారీ ముగ్గురు ఖాన్ లని పట్టుకుని ఇండస్ట్రీ లో వాళ్ళే గొప్ప అన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది అన్నాడు ఆమిర్ ఖాన్.


ఇటీవల షారూఖ్, సల్మాన్ నటించిన జబ్ హారీ మెట్ సేజల్, ట్యూబ్‌లైట్ సినిమాలు బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. అలాంటివి సహజం అంటున్నాడు ఆమిర్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: