హీరో మహేష్ బాబు ఫాన్స్ కి ఆయన కూతురు సితార అంటే అపురూపం. ఆమె బయట ఎక్కడ కనపడినా హ్యాపీ ఫీల్ అయ్యే అభిమానులు ఆమెకి సంబంధించి ఇంటర్నెట్ లో ఒక ఫోటో వచ్చినా వీడియో వచ్చినా వెంటనే ట్రెండ్ చేస్తారు.


మహేష్ - నమ్రత ల కి ఆమె ఎంత గారాల పట్టీనో ఫాన్స్ కి కూడా అంతే. ఆమె పుట్టిన రోజు వస్తే చాలు ట్విట్టర్ లో ఆమె ట్రెండ్ కనపడి తీరుతుంది. తాజాగా నమ్రత తన ఇంస్టా లో పోస్ట్ చేసిన ఒక ఫోటో సితార కి సంబందించింది ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.


‘హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక డ్యాన్స్ అకాడమీ నాట్య వేద.. దానిని నిర్వహిస్తున్న మాస్టర్ అరుణా బిక్షుక్ గారు, ఆమె కూతురు మహతి భిక్షుక్ గారి దీవెనలతో సితార తన స్నేహితురాలితో కలిసి మొదటి రోజు డ్యాన్స్ నేర్చుకుంది’ అని ఆ పోస్ట్ లో నమ్రత పేర్కొన్నారు. నటరాజ విగ్రహం కి పూలు పెడుతున్న సితార ఫోటోని ఆమె షేర్ చేసారు.


ఎంత క్యూట్ గా ఉందొ సితార అంటూ గంటలో వేల  కామెంట్ లు వెల్లువెత్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: