మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాకు బుల్లి సెలిబ్రిటీ. క్యూట్ గా కనిపించే సితారను మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా నెటిజన్స్ అందరూ సితార క్రేజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సితార మహేష్ నటించిన ‘ఆగడు’ ‘శ్రీమంతుడు’ సినిమాలలోని పాటలకు డాన్స్ లు చేస్తూ వేసిన స్టెప్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక మంది దృష్టిని ఆకర్షించాయి. 

సితార తల్లి నమ్రత కూడ సితారకు ఉండే కళా తృష్ణను ప్రోత్సహిస్తూ సితార చేసే బుల్లి బుల్లి పనులకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సితార క్రేజ్ ను పెంచుతోంది. ఇది ఇలా ఉండగా సితార దృష్టి ఇప్పుడు శాస్త్రీయ నృత్యం పై పడింది. 

సితారను నాట్య కళాకారిణిగా తీర్చి దిద్దడానికి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాశాల ‘నాట్య వేద’ సంస్థలో చేర్పించినట్లు నమ్రత తన ట్విటర్ లో తెలియ చేసింది. ఈ సందర్భంగా నటరాజ పూజ చేస్తున్న సితార ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నమ్రత.

ఆ మధ్య అలీ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ సితారను కాబోయే హీరోయిన్ గా అభివర్ణించాడు. అయితే అలీ జోశ్యంలో ఎంత నిజం అవుతుందో తెలియదు కాని త్వరలోనే సితార శాస్త్రీయ నాట్యానికి సంబంధించిన అరంగేట్రం త్వరలోనే భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: