తెలుగు చలన చిత్ర రంగంలో రారాజు గా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత తిరిగి వెండి తెరపై కనిపించారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి రిమేక్ గా మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.  ఈ చిత్రంలో మెగాస్టార్ పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారని ఖితాబు ఇచ్చారు.  బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు.  
chiranjeevi
ఇక చిరంజీవి 151 చిత్రం  సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతుంది. ఉయ్యలవాడ నరసిం హారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ కథను పరుచూరి సోదరులు అందించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో నిర్మించబడుతుంది.  150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల టాపిక్ లు నడిచాయి.

తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి   ఈ సినిమా టైటిల్ ఫైనల్ గా ‘ సైరా’ నరసింహారెడ్డి అని ఫైనల్ చేశారు.  ఒకేసారి తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తుండటంతో అందుకు తగ్గట్టుగా ‘సైరా’ అనే టైటిల్ ను ఫిక్స్  చేసినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: