ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా విడుదల కాకుండానే కొరటాల శివ కాంబినేషన్ లో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ‘భరత్ అనే నేను’ మూవీకి ‘స్పైడర్’ కు మించి బిజినెస్ జరుగుతూ ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. ఈసినిమా షూటింగ్ కేవలం 25శాతం మాత్రమే పూర్తి అయినా బయ్యర్లు చాలామంది ‘స్పైడర్’ కంటే ‘భరత్ అనే నేను’ మూవీ పట్ల ఎక్కువ క్రేజ్ ను కనపరుస్తూ విపరీతమైన ఫ్యాన్సీ రేట్లను ఆఫర్ చేయడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ‘స్పైడర్’ మూవీ పై మొదట్లో భారీ అంచనాలు ఉన్నా రానురాను ఈసినిమా పై ప్రేక్షకులలోనే కాకుండా బయ్యర్లలో కూడ ఆసక్తి తగ్గిపోతోంది. దీనికితోడు ఈమధ్య విడుదలైన ‘స్పైడర్’ రెండవ టీజర్ కు అదేవిధంగా ఈసినిమాలో ఇప్పటికి విడుదలైన మొదటి పాటకు నెగిటివ్ కామెంట్స్ రావడంతో రోజురోజుకి ‘స్పైడర్’ పై అంచనాలు తగ్గిపోతున్నాయి. 

అయితే దీనికి విరుద్ధంగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పే ఒక ఆసక్తికర విషయం ఈమధ్య జరిగింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ హక్కులను దాదాపుగా 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలలో వార్త హడావిడి చేస్తోంది. 

ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ లో బాలీవుడ్ మార్కెట్ లో రేటు పలకడం అత్యంత ఆశ్చర్యకరమైన న్యూస్ గా మారింది. ఇలాంటి పరిస్థుతులలో సెప్టెంబర్ 9న విడుదల కాబోయే ‘స్పైడర్’ ధియేటిరికల్ ట్రైలర్ విడుదల తరువాత మాత్రమే ఈసినిమా పై నమ్మకం పెట్టుకోవాలా ? వద్దా అన్న అంశాన్ని నిర్నయించుకోవాలని ఈసినిమా బయ్యర్లు చాలామంది భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మహేష్ నటిస్తున్న రెండు సినిమాలలో ఒక సినిమాకు ఏర్పడిన విపరీతమైన క్రేజ్ మరొక సినిమాకు శాపంగా మారడం యాదృశ్చికం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: