మెగాస్టార్ చిరంజీవి త‌న కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150తో స‌త్తా చాటాడు. ఖైదీ నెంబ‌ర్ 150 చిరు కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమా రూ.100 కోట్ల‌కు పైగా షేర్ సాధించి నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తుడిచిపెట్టింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు త‌న 151వ సినిమాకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా వార్త‌ల్లో నానుతోన్న చిరు 151వ సినిమా పేరు ఎట్ట‌కేల‌కు ఈ రోజు అధికారికంగా ఖ‌రారు అయ్యింది.

sye raa movie కోసం చిత్ర ఫలితం

చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు. సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు కాస్ట్ అండ్ క్రూ వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌, కాస్టింగ్‌తోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది.


ప్ర‌స్తుతం దీనిపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే అప్పుడే ఈ సినిమా టైటిల్ సైరా పై కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ అయ్యింది. టాలీవుడ్‌లో ఇటీవ‌ల టైటిల్స్‌, క‌థ‌ల విష‌యంలో త‌ర‌చూ కాంట్ర‌వ‌ర్సీ ఇష్యూలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు గ‌తంలో అనుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి కాకుండా సినిమా పేరు మార్చి.. 'సైరా' టైటిల్‌ను సినిమా యూనిట్‌ ఖరారు చేసింది. 

sye raa movie కోసం చిత్ర ఫలితం

ఈ సినిమా పేరు మార్చడంపై ఉయ్యాలవాడ వార‌సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన తొలి తెలుగు దేశభక్తుడు అయిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. 'సైరా నరసింహారెడ్డి' సినిమా టైటిల్ మార్చి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగానే ఉంచాల‌ని ఉయ్యాల‌వాడ వార‌సులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: