మెగాస్టార్ 151వ మూవీపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే మూవీ కూడా మొదలైంది. ఖైదీ నెంబర్ 150గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ రాబోతున్నాడు. రేనాటి సూర్యుడిగా ఖ్యాతికెక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Image result for megastar

మెగా ఫ్యాన్స్ కు మళ్లీ పండగొచ్చింది. రీ ఎంట్రీలో ఖైదీ నంబర్ 150గా రికార్డులు సృష్టించిన చిరంజీవి.. ఇప్పుడు రేనాటి సూర్యుడిగా కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వాస్తవానికి 150వ సినిమాగానే ఉయ్యాలవాడ చరిత్రను తెరకెక్కిస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఇది వెనక్కు మళ్లి ఖైదీ సినిమా ముందుకొచ్చింది.

Image result for megastar

రీ ఎంట్రీలో సేఫ్ గేమ్ ఆడిన మెగాస్టార్ మాస్ లుక్ తో కలెక్షన్లు రాబట్టాడు. ఇప్పుడు హిస్టారికల్ మూవీపై కన్నేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే ఉయ్యాలవాడ మూవీకి క్లాప్ కొట్టారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్, మెగాస్టార్ ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ రిలీజ్ చేశారు. అందరూ అనుకున్నట్టుగా సినిమా పేరు ఉయ్యాలవాడ కాకుండా సైరా అని ఫైనల్ చేశారు. అదే సమయంలో మెగాస్టార్ కత్తి పట్టుకున్న స్టిల్ తో ఫేస్ చూపించకుండా ఇంట్రస్ట్ క్రియేట్ చేశారు.

Image result for megastar

ఫస్ట్ లుక్ తోనే మూవీపై ఇంట్రస్ట్ పెంచేసిన మెగాస్టార్.. తారాగణంపై కూడా ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాదాపు అన్ని భాషల్లోని ప్రముఖ నటులు సైరాలో నటించనుండటం విశేషం. మెగాస్టార్ సరసన తొలిసారి నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు సదీప్,  తమిళ హీరో విజయ్ సేతుపతి, జగపతిబాబు నటించనున్నారు.

Image result for megastar

మెగాస్టార్ చిరంజీవితో పాటు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని ప్రముఖ నటులందరూ ఒకే సినిమాలో వెండితెరపై కనిపించబోతుండడంతో సైరా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సైరా మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మాత.


మరింత సమాచారం తెలుసుకోండి: