నిన్న చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన ''సైరా నరసింహారెడ్డి'' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు లభిస్తున్న విశేష స్పందన మెగా కాంపౌండ్ ను ఆనందంలో ముంచెత్తి వేస్తోంది. అయితే ఇంత భారీ బడ్జెట్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన హేమాహేమీలు అందరూ రంగంలోకి దిగిన ఈమూవీ మార్కెట్ మెగా కాంపౌండ్ ముఖ్యంగా రామ్ చరణ్ ఊహలకు అనుగుణంగా అత్యంత భారీ స్థాయిలో జరిగే ఆస్కారం ఉందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి కారణం ఈసినిమాకు ఖర్చు పెట్టబోతున్న బడ్జెట్ ప్రస్తుతం ఈసినిమాకు పనిచేస్తున్న ప్రముఖ నటీనటులు అదేవిధంగా సాంకేతిక నిపుణుల పారితోషికాలను లెక్కలోకి తీసుకుంటే ఈసినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ బడ్జెట్ తో కలిపి దాదాపు 200 కోట్ల వరకు ‘సైరా’ కు ఖర్చు అవుతుంది అని అంటున్నారు. ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈసినిమాకు కనీసం 250 కోట్ల బిజినెస్ జరగాలి.

అయితే ‘సైరా’ కు అటువంటి మార్కెట్ జరిగే ఆస్కారం ఉందా అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవికి బాలీవుడ్ లో పెద్దగా చెప్పుకోతగ్గ క్రేజ్ లేదు ఇదే పరిస్థితి కోలీవుడ్ మాలీవుడ్ మార్కెట్ లో కూడ ఉంది. దీనికితోడు దర్శకుడు సురేంద్ర రెడ్డికి కూడ జాతీయ స్థాయిలో చెప్పుకోతగ్గ ఇమేజ్ దర్శకుడుగా లేదు. 

ఈ పరిస్థుతులలో వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈమూవీ మార్కెట్ కోసం వ్యూహాత్మకంగా అమితాబ్ సుదీప్ విజయ్ సేతుపతి లతో పాటు జాతీయ స్థాయిలో పేరుగాంచిన సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపినా ఈమూవీ మార్కెట్ గురించి రామ్ చరణ్ చాల భారీ కసరత్తులు చేయవలసి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ‘బాహుబలి’ స్థాయిలో భారీ రికార్డుల పై కన్నేసిన చిరంజీవి ‘సైరా’ ప్రయత్నం ఊహించిన స్థాయిలో ఘనవిజయం సాధించాలి అంటే అనేక సవాళ్ళను ఈమూవీ ఎదుర్కొనాల్సి వస్తుందని ఈమూవీ మోషన్ పోష్టర్ పై విశ్లేషణలు చేస్తున్న విశ్లేషకుల అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి: