మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఎన్నో సంచలనాలు సృష్టించబోతుంది అని ఆ సినిమా కాస్ట్ అండ్ క్రూని చూస్తేనే అర్ధమవుతుంది. సైలెంట్ గా వచ్చిన చిరు సైరా మోషన్ పోస్టర్ తో ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించాడు. ఇక ఈ సినిమాతో బిగ్ బీ సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్ర చేస్తుండటం విశేషం.


మనంలో ఏదో అలా మెరిసిన అది లెక్కలోకి రాలేదు. పక్కాగా చెప్పాలంటే బిగ్ బీ అమితాబ్ కు ఇదే తొలి తెలుగు సినిమా అని చెప్పొచ్చు. ఇక కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఇందులో భాగమవుతున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి సైరా లో ఉన్నాడు. ఇవన్ని ఒక ఎత్తైతే మ్యూజిక్ డైరక్టర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడం ఈ ప్రాజెక్ట్ తో ఓ కొత్త జోష్ తెచ్చిపెట్టింది.


చిరుతో రెహమాన్ 23 ఏల్ల క్రితం శంకర్ తీసిన జెంటిల్ మన్ హింది రీమేక్ లో ద జెంటిల్మన్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత వారిద్దరు కలిసి పనిచేసే అవకాశం దొరకలేదు. అకడెమీ అవార్డ్ అందుకున్న రెహమాన్ సైరా నరసింహారెడ్డి ప్రెస్టిజియస్ సినిమాకు మ్యూజిక్ అందించడం గొప్ప విషయమని చెప్పాలి. 


మొత్తానికి అనుకున్న దాని కన్నా భారీగానే సైరా నరసింహారెడ్డి సెట్స్ మీదకు వెళ్తుంది. మోషన్ పోస్టర్ తో ఊపు తెచ్చిన ఈ సినిమా ఇదే జోష్ సినిమాలో కూడా ఉండేలా కోరుకుంటున్నారు మెగా అభిమానులు. సినిమా షెడ్యూల్ గురించి డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: