రామ్ గోపాల్ వర్మ మాటలు సంచలనాలకు చిరునామాగా ఉంటాయి అన్నది అనేక సందర్భాలలో జనం ఎరిగిన నిత్య సత్యం. అటువంటి వివాదాల వర్మ ఈశుక్రవారం విడుదలకు సిద్ధమవుతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీపై తనదైన తీరులో స్పందించాడు. 

‘అర్జున్ రెడ్డి’ ఆడియో వేడుకలో హీరో విజయ్ దేవరకొండ స్పీచ్ విన్నవారు అతడి పై రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందా అని కామెంట్స్ కూడ చేసుకున్నారు. ఈసినిమాలోని బూతులు కట్ చేసినందుకు సెన్సార్ బోర్డును టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ విన్నవారు అతడి ప్రసంగతీరు రామ్ గోపాల్ వర్మ స్టయిల్ లో ఉంది అంటూ కామెంట్స్ చేసుకున్నారు. 

ఈ కామెంట్స్ ఇలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కొంచం ఆలస్యంగా  ఈసినిమా ట్రైలర్ గురించి స్పందించాడు. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది అంటూ ఈసినిమా హీరో విజయ్ దేవరకొండ చాలా విషయాల్లో తనను తలపిస్తున్నాడని అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను చావకుండానే అతను ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని తనదైన శైలిలో వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. 

అయితే ఈ కామెంట్స్ పై హీరో విజయ్ దేవరకొండ సమాధానం ఇస్తూ ‘సార్ మీరు పుట్టకముందే నేను పుట్టడమే కాదు మీరు శివ తీసిన 1989వ సంవత్సరంలోనే నేను పుట్టాను’’ అంటూ బదులిచ్చాడు. ఇది ఇలా ఉండగా ఎల్లుండి విడుదల కాబోతున్న ఈసినిమా విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువే హైప్ వచ్చింది. ‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ  కు వచ్చిన క్రేజ్ వలనో మరి ఏ కారణం వలనో తెలియకపోయినా ఈ సినిమాకు ఏర్పడ్డ భారీ అంచనాలు అందరినీ  ఆశ్చర్య పరుస్తున్నాయి. దీనికితోడు కాంట్రవర్సీలు కూడ  తోడవడంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: