సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన ఆర్జివి ఇన్ స్టాగ్రాం ద్వారా తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ శుక్రవారం రిలీజ్ అవబోతున్న అర్జున్ రెడ్డి విషయాల గురించి మొదటిసారి ప్రస్తావించిన వర్మ అర్జున్ రెడ్డి టీజర్ ట్రైలర్ తనని ఇంప్రెస్ చేశానని అన్నారు.


ఆ సినిమా హీరో విజయ్ రెడ్డి చాలా విషయాల్లో తనలా అనిపిస్తున్నాడని అంటున్న వర్మ తాను చావకుండానే తనలాంటి మరో మనిషి ఎలా పుట్టాడో అనంటున్నాడు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్ సెన్సార్ సభ్యులతో పాటుగా తన మాట్లాడే విధానాన్ని తప్పు పట్టిన వారిని బూతులతో ఏకేశాడు. తన మైండ్ లో ఏది వస్తే అది చెప్పే వర్మ లానే అనిపించాడు విజయ్ కూడా.   


ఇప్పుడు ఆ వర్మనే విజయ్ కు సపోర్ట్ గా నిలవడం విశేషం. ఇక వర్మ చేసిన ఈ కామెంట్ కు మీరు పుట్టకముందు కాదు మీరు తీసిన శివ తీసిన 1989 సంవత్సరమే నేను పుట్టా అని బదులు ఇచ్చాడు. అర్జున్ రెడ్డి ప్రమోషన్ కు వర్మ కూడా తన మార్క్ కామెంట్స్ తో సహకరించినట్టే అనిపిస్తుంది.


ఇక కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ విజయ్ సినిమా పోస్టర్స్ చించేశాడు కాబట్టి విజయ్ వెళ్లి ఆయన చొక్కా చించేయాలని చెప్పాడు. విహెచ్ చించేసిన పోస్టర్స్ లో తప్పేముందని విహెచ్ తన మన్వళ్లు మనవరాళ్లను అడగాలని అన్నారు. అంతేకాదు విజయ్ విఎచ్ కామెంట్స్ కు 'తాతయ్య చిల్' అన్నాడో.. వర్మ కూడా విహెచ్ ను తాతయ్య అంటూ పలకడం విశేషం. మొత్తానికి విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డికి వర్మ సపోర్ట్ దొరికేసింది. మరి వర్మ చెప్పినట్టుగా వర్మ వారసుడు విజయ్ దేవరకొండ అన్నది ఎంతవరకు నిజమో చూడాలి.     


మరింత సమాచారం తెలుసుకోండి: