టాప్ హీరోలతో కమర్షియల్ సినిమాలు తీస్తూ అందులో సామాజిక కోణం ఆవిష్కరించడంలో దర్శకుడు మురగదాస్ స్టైల్ విభిన్నం. ఎందరో టాప్ దర్శకులు ప్రస్తుతం హడావిడి చేస్తున్నా మురగదాస్ ‘గజిని’ ‘రమణ’ ‘కత్తి’ ‘తుపాకి’ లాంటి సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా ఆ సినిమాలలో నటించిన హీరోల క్రేజ్ ను విపరీతంగా పెంచాయి.

ప్రస్తుతం మహేష్ బాబు తో తీస్తున్న ‘స్పైడర్’ సినిమా వచ్చేనెల దసరాను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ మురగదాస్ నిన్న హైదరాబాద్ లో ఒక మీడియా మీట్ నిర్వహించాడు. ఈ మీడియా మీట్ లో అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మురగదాస్ టాప్ హీరోల కలక్షన్స్ రికార్డుల పై చాల విభిన్నంగా స్పందించాడు. ‘

ఈ సమావేశంలో పాల్గొన్న ఒక మీడియా ప్రతినిధి మురగదాస్ ను ‘స్పైడర్’ ఎటువంటి కలక్షన్స్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ప్రశ్నించినప్పుడు మురగదాస్ ఎవరు ఊహించని ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తాను తీసే సినిమాకు ఎంత ఖర్చు అయింది ఎంత వచ్చింది అన్నదే ఆలోచిస్తానుకాని మిగిలిన సినిమాల కలక్షన్స్ రికార్డులతో తాను ఎప్పుడు తన సినిమాలను పోల్చుకోను అంటూ ఒక ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చాడు.

దీనితో మురగదాస్ మహేష్ తో తీస్తున్న ‘స్పైడర్’ మూవీ మహేష్ అభిమానులు కోరుకునే విధంగా రికార్డులను క్రియేట్ చేయదా ? అన్న అనుమానం ఆ మీడియా మీట్ కు వచ్చిన కొంతమంది పత్రికా ప్రతినిధులకు వచ్చినట్లు టాక్. ఇదే సందర్భంలో మురగదాస్ మాట్లాడుతూ సినిమాలలో తాగుతూ అమ్మాయిలను ఏడిపించే హీరోలను చూసి ఎంజాయ్ చేసే వ్యక్తులు నిజ జీవితంలో మాత్రం అటువంటి సంఘటనలు సహించరు అంటూ అందుకే అటువంటి సీన్స్ తన సినిమాలలో ఉండవు అంటూ తనలోని సామాజిక కోణాన్ని బయట పెట్టాడు మురగదాస్. 

ఇదే సందర్భంలో మురగదాస్ మాట్లాడుతూ ఈసినిమా క్లైమాక్స్ అందరికీ అర్ధం అయ్యే విధంగా అనేక మార్పులు చేర్పులు చేసానని చెపుతూ మహేష్ లాంటి టాప్ హీరో మాత్రమే ‘స్పైడర్’ లాంటి సినిమా చేయగలదు అంటూ మహేష్ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు మురగదాస్..  


మరింత సమాచారం తెలుసుకోండి: