ప్రముఖ నిర్మాతలు అంతా రాజమౌళితో సినిమాలు తీయాలని ఉబలాట పడుతూ ఉంటే ఒక ప్రముఖ నిర్మాత మాత్రం స్వయంగా రాజమౌళి రంగంలోకి దిగి కోరిన కోరికను తిరస్కరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తన ప్రియ స్నేహితుడు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటికి సాయం చేయాలని చేసిన ప్రయత్నాలకు రాజమౌళి ఇమేజ్ ఏమాత్రం సహకరించలేదు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.  

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే రజినీకాంత్ తో ‘రోబో 2.0’ ను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాకరన్ నుండి రాజమౌళికి ఈ షాక్ తగిలినట్లు టాక్. వచ్చే సంవత్సరం జనవరిలో విడుదల కాబోతున్న ‘రోబో 2.0’ మూవీని తెలుగులో విడుదల చేయడానికి రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటి తీవ్ర ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈసినిమా నిర్మిస్తున్న శుభకరన్ ను కలిసి ఒప్పించడానికి సాయి కొర్రపాటి ప్రత్యేకంగా రాజమౌళిని వెంటపెట్టుకుని చెన్నై వెళ్ళినట్లు సమాచారం. 

అక్కడ వీరిద్దరు శుభకరన్ కలిసి ‘రోబో 2.0’ తెలుగు రైట్స్ కు సంబంధించి 60 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాలలో రజనీకాంత్ పట్ల ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని లైకా ప్రొడక్షన్ అధినేత ‘రోబో 2.0’  రైట్స్ ను ఎట్టి పరిస్తుతులలోను 80 కోట్లకు తగ్గించేది లేదని శుభకరన్ సున్నితంగా రాజమౌళికి చెప్పడంతో రాజమౌళి షాక్ అయినట్లు సమాచారం. 

దీనితో వ్యాపారం దగ్గర తమిళ నిర్మాతలు ఎంత స్పష్టంగా ఉంటారో అర్ధం అవుతుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమూవీ రైట్స్ ను లైకా సంస్థ కోరుకున్న విధంగా 80 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నరంగ్ కు అమ్మినట్లుగా వార్తలు రావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: