తెలుగు ఇండస్ట్రీలో లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన దేవరకొండ విజయ్ తర్వాత ఎవడే సుబ్రమాణ్యం చిత్రంతో మంచి పాత్రలో కనిపించాడు.  ఇక ‘పెళ్లిచూపులు’ చిత్రం తర్వాత మనోడికి స్టార్ ఒక్కసారే మారిపోయింది.  తాజాగా విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తున్న తాజాగా చిత్రం 'అర్జున్‌ రెడ్డి'.
Related image
ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.   ఇప్పటికే ఈ చిత్రంపై కొన్ని వివాదాలు చుట్టు ముట్టాయి..ముఖ్యంగా లిప్ లాక్ కి సంబంధించిన పోస్టర్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.  తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు ఏకంగా పోస్టర్ చించిపడేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని లిప్ లాక్‌లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు.
Image result for arjun reddy posters
ఇక అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు హీరో విజయ్ మాట్లాడిన బూతు మాటలపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.  తాజాగా అర్జున్ రెడ్డి చిత్రంలో ఓ ముద్దు సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: