తెలుగు బుల్లితెరపై ఈ మద్య వస్తున్న పాపులర్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  మొదట్లో ఈ షోపై కొంత మంది ప్రేక్షకులు పెదవి విరిచారు.  ఫేడ్ ఔట్ అయిన కంటెస్టంట్స్ తో ఈ ప్రోగ్రామ్ ఎలా ముందుకు సాగుతుందీ అన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ రాను రాను బిగ్ బాస్ షో పై ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో చిత్ర విచిత్రమైన టాస్క్ లతో బాగా అలరిస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడి తో  అత్యధిక టి ఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది.
Image result for big boss show rana
ఇక ఈ షో కి మరింత గ్లామర్ తెచ్చేందుకు యాజమాన్యం బాలీవుడ్ తరహాలో ఆలోచిస్తుంది. ఇప్పటికే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రమోషన్ కోసం భళ్లాల దేవ రానా ఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేశాడు.  ఆ తర్వాత ఆనందో బ్రహ్మ చిత్రం కోసం ప్రమోషన్ లో భాగంగా అందాల భామ తాప్సీ ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ సభ్యులతో సందడి చేసింది.
Image result for big boss show taapsi
తాజాగా ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా..‘పెళ్లి చూపులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హీరో దేవరకొండ విజయ్.  ప్రస్తుతం విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.  

ఇప్పటికే పలు వివాదాలతో మీడియా తెగ హల్ చల్ చేస్తున్న అర్జున్ రెడ్డి ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేకిస్తుంది.


సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో థియేటర్ ఆర్టిస్ట్ షాలిని హీరోయిన్ గా పరిచయం అవుతుంది.  అలనాటి కాంచ‌నతో పాటు విపిఎస్. కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌ లు ప్రధాన పాత్రలు పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: