హన్సిక పెరుచేపితే ప్రస్తుతం తమిళ తంబీలు మైమరచిపోతున్నారు. ఆనందంతో అభిమానుల చేత ఏకంగా ఒక గుడినే కట్టించుకున్న క్రేజ్ ఆమెది. ఈమధ్యనే ఆమె నటించిన ‘సింగం-2’ సినిమా లో ఆమె నటనకు విపరీతమైన పేరు రావడంతో మన యోగా బ్యూటీ అనుష్క కు కూడా షాక్ తగిలేట్టు చేసింది ఈ బబ్లీ గర్ల్.

నిండా పాతికేళ్ళ వయసు లేకపోయినా కోలీవుడ్ లో ఐదు సినిమాలు, టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రస్తుతం చేస్తూ, బిజీ బిజీ గా రోజులు గడిపేయడమే కాకుండా మధ్యలో టైం దొరికినప్పుడల్లా హీరో శింబు ను ప్రేమిస్తూ కోలీవుడ్ మీడియా కు టాక్ ఆఫ్ ది గర్ల్ గా మారింది. అటువంటి హన్సిక వ్యవహారాలు అన్నీ కూడా హన్సిక తల్లి చూసుకుంటూ ఉంటుంది. సామాన్యంగా హీరోయిన్స్ తల్లులు అందరూ చేసే పని ఇదే. కాని ఇక్కడ హన్సిక తల్లి కొద్దిగా డిఫరెంట్. హన్సిక కూడా షూటింగ్ స్పాట్ కు వచ్చిన వెంటనే హన్సిక తల్లి ఓవర్ యాక్షన్ మొదలు అవుతుందట. ఆ యూనిట్ కు సంబంధించిన అందరి వ్యక్తులతో ముఖ్యంగా నిర్మాత, దర్శకుడు, హీరోలతో అతి చనువుగా మాట్లాడుతూ వాళ్ళకు తలనొప్పి తెప్పించడమే కాకుండా హన్సికకు కూడా తలనొప్పిగా తయారుఅయిందట ఈ మాతృమూర్తి.

దీనితో మన బబ్లీ గర్ల్ తన తల్లి ఓవర్ యాక్షన్ చూసి తట్టుకోలేక సినిమా షూటింగ్ లో ఎలా ఉండాలో తెలియజేస్తూ యూనిట్ సభ్యుల ముందే ఈ మధ్య జరిగిన ఒక షూటింగ్ లో క్లాస్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరచింది అట. ఐదేళ్ళ వరకూ శింబు ని ప్రేమిస్తూ కాలం గడిపి, ఆ తరువాత మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెపుతూ, అప్పటి దాకా సినిమాలే నా ప్రపంచం అని చెపుతున్న ఈ తెలివైన ముద్దు గుమ్మ కు తన తల్లిపై అంత కోపం ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: