సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలన్న కొన్ని సినిమాలు అర్ధాంతరంగా  ఆపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పటి స్టార్ హీరోల సినిమాలు సైతం కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ మద్యలోనే ఆపిన సంఘటనలు కోకొల్లు.  అలాంటి సీన్లు  ఇప్పటి అప్ కమింగ్ హీరోల విషయాల్లో కూడా జరుగుతున్నాయి.  ఇక తెలుగు ఇండస్ట్రీ కెపాసిటీ ఎంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  
Image result for baahubali 2
జానపద చిత్రాలు ఈ రేంజ్ లో కూడా తీస్తారా అన్న విధంగా అత్యద్భుతమైన ఫ్యూజువల్ ఎఫెక్ట్స్ తో తెరెకెక్కించారు.  భారత దేశంలో  అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఎన్నో రికార్డులు నెలకొల్పింది. అయితే ఇలాంటి సినిమా మళ్లీ తెరకెక్కుతాయా అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు.  అయితే ఆ మద్య బాహుబలిని తలదన్నే చిత్రం ఒకటి తెరకెక్క బోతుందని ప్రచారం మొదలయ్యాయి.  ఇంతకీ ఆ చిత్రం ఏదీ అనుకుంటున్నారా..? సుమారు రూ.250 కోట్లు పెట్టి భారీ బడ్జెట్ తో  సంఘమిత్ర అనే చిత్ర రూపకల్పన కు శ్రీకారం చుట్టాడు ఖుష్భు భర్త సుందర్ సి.  
Image result for sangamitra motion posters
ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది. అంతే కాదు  కేన్స్ ఉత్సవంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు ఆ వేడుకలో శృతి హాసన్ , సుందర్ లు పాల్గొన్నారు కట్ చేస్తే ఏమైందో ఏమో కానీ శృతి హాసన్ ఆ సినిమా నుండి తప్పుకుంది.  ఆ తర్వాత హీరోయిన్ విషయంలో ఎంతో మందిని అనుకున్నా ఎవ్వరూ ఆ స్థాయికి తగ్గట్టు సెల్ కాలేదట.  దాంతో ఈ సినిమా పై నీలినీడలు కమ్ముకున్నాయి.  
Image result for sangamitra motion posters
ఇక స్టార్ హీరోల విషయానికి వస్తే..‘సంఘమిత్ర’ విషయంపై  సుముఖత చూపించలేదు . ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంఘమిత్ర సినిమా ఆగిపోయినట్లే అని అంటున్నారు ఎందుకంటే ఆ చిత్ర దర్శకులు సుందర్ సి మరో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.  గతంలో విశ్వనటుడు కమల్ హానన్ కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు శ్రీకారం చుట్టారు..కానీ అవి మద్యలోనే ఆపివేయడం జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: