తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో తన అందాలతో కుర్రకారు మతులు పొగొడుతున్న హీరోయిన్, ఐటమ్ బేబీ లక్ష్మీరాయ్.  ఆ మద్య లారెన్స్ తో వచ్చిన ‘కాంచన’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత మెగాస్టార్, పవన్ కళ్యాన్, రవితేజ సరసన ఐటమ్ సాంగ్ లో నటించి దుమ్మురేపింది.  హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ లో మెప్పిస్తున్న లక్ష్మీ తన పేరు రాయ్ లక్ష్మిగా మార్చుకుంది.  
Image result for rai laxmi july
తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న ‘జూలీ 2’ టీజర్ రిలీజ్ అయ్యింది.  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ  'జూలి 2' సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'జూలి'కి సీక్వెల్ గా దర్శక నిర్మాత శివదాసాని ఈ సినిమాను తెరకెక్కించాడు.  రాయ్ లక్ష్మి అందాల పైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ కుర్రకారుకి పిచ్చెక్కేలా ఉంది.  
Related image
ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఏ రేంజ్ లో అందాలను ఆరబోసిందనేది టీజర్ తోనే తెలిసిపోతోంది.  టీజర్ చూస్తుంటే రాయ్ లక్ష్మి అందాలు, శృంగార సన్నివేశాల్లో బాగానే రెచ్చిపోయినట్లు కనిపిస్తున్నాయి.  ఈ సినిమా బాలీవుడ్ మంచి హిట్ అయితే  భారీ ఛాన్సులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకుంది రాయ్‌లక్ష్మి.


మరింత సమాచారం తెలుసుకోండి: