తెలుగు బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్ ’.  టెలివిజన్ పై మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రోగ్రామ్ కి కొత్తలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా..శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ చేస్తున్న సందడికి అందరూ ఫిదా అయ్యారు.  ఇక బిగ్ బాస్ షో నుంచి ప్రతి వారం ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవ్వడంపై కూడా క్యూరియాసిటీ నెలకొంది.  
Image result for meda meeda abbai
అంతే కాదు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సభ్యులకు చిత్ర విచిత్రమైన టాస్క్ లు విధించడం దాంతో టీమ్ సభ్యుల మద్య రగడ నెలకొనడం అభిమానులకు ఆకర్షణగా నిలుస్తుంది.  ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి ఈ మద్య సినీ తారల సందడి నెలకొంది.  ఆ మద్య నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం రానా ఎంట్రీ ఇచ్చారు.  

ఆ తర్వాత ఆనందో బ్రహ్మ చిత్రం కోసం తాప్సి, అర్జున్ రెడ్డి చిత్రం కోసం దేవరకొండ విజయ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. తాజాగా బిగ్ బాస్ లోకి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నారు.

ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారా..! ‘మేడమీద అబ్బాయి’.  అదేనండీ మన అల్లరి నరేష్..రేపు అల్లరి నరేష్ నటించిన ‘మేడమీద అబ్బాయి’ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ బిగ్ బాస్ హౌజ్ లో అల్లరి చేయబోతున్నారన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: