గత కొంత కాలంగా బాలీవుడ్ లో హాలీవుడ్ ని తలదన్నే విధంగా బూతు కంటెంట్ ఉన్న చిత్రాలు వస్తున్నాయి.  తక్కువ ఖర్చు..ఎక్కువ లాభాలు ఉండటంతో ఇలాంటి అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శక, నిర్మాతలు.  ముఖ్యంగా  క్రైమ్, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఇలాంటి చిత్రాల్లో లిప్ లాక్, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లలో హీరోయిన్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు.  ఇలాంటి పాత్రల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడటం మరో విశేషం.

ఒక్కో సమయంలో బాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేయలేని కలెక్షన్లు ఇలాంటి అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలు చేయడం ఆశ్చర్యం అనిపిస్తుంది.  ఈ మద్య కొన్ని చిత్రాల సెన్సార్ రిపోర్ట్ చూస్తుంటే దిమ్మతిరిగి పోతుంది..దాదాపు 42 కటింగ్స్ తో ఓ సినిమా రిలీజ్ కి సిద్దం కావడం ఇందుకు ఉదాహారణ.  ఆ మద్య సన్నీలియోన్ నటించిన మస్తి జాదే చిత్రం సెన్సార్ బోర్డు వారు ఏం కటింగ్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ సినిమా ఏ రేంజ్ లో తీశారో అర్థం అవుతుంది.
Image result for cbfc chairman prasun joshi bans x zone movie
 తాజాగా మరో బూతు కంటెంట్ చిత్రాన్ని ఏకంగా బ్యాన్ చేశారట.  తాజాగా బాలీవుడ్ లో తీసిన ‘ఎక్స్ జోన్’ అనే మూవీని సెన్సార్ బోర్డు ఏకంగా నిషేధించింది.   ఇటీవల బాలీవుడ్ లో చాలా సినిమాలు సెన్సార్  విషయంలో పలు వివాదాలు అయ్యాయి కాగా తాజాగా ఓ అడల్ట్ సినిమాని ఏకంగా బ్యాన్ అది కూడా సెన్సార్ బోర్డు బ్యాన్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.   ఎక్స్ జోన్ చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని అలాగే నగ్న దృశ్యాలు కూడా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ నిషేధం విధించారు.

కాకపోతే..పహ్లాజ్ నిహ్లానీ అనే సెన్సార్ బోర్డు చైర్మన్ వల్ల వివాదాలు ఎక్కువ అవుతున్నాయని అతడ్ని మార్చి ప్రసూన్ జోషి ని నియమించారు.  కానీ,  నిహ్లానీ కంటే దారుణంగా ఉంది ప్రసూన్ జోషి నిర్వాకం ఎందుకంటే నిహ్లానీ కొన్ని కట్స్ చెప్పడం చేసాడు కానీ ప్రసూన్ ఏకంగా ఎక్స్ జోన్ అనే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా ఏకంగా నిషేధం విధించాడు.  ఇప్పుడు బాలీవుడ్ లో ఈ విషయంపై అందరూ షాక్ లో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: