బిగ్ బాస్ తెలుగు సీజన్ లో 58 రోజులవుతుండగా కేవలం ఇన్నాళ్లు శని ఆదివారలు అది కూడా ఎన్.టి.ఆర్ వస్తేనే షోకి రేటింగ్ పెరుగుతుంది అన్న వాదన ఉంది. అఫ్కోర్స్ బిగ్ బాస్ తెలుగుకి ఈ రేంజ్ రావడానికి కారణం ఎన్.టి.ఆర్. అయితే అనూహ్యంగా నిన్న అనగా మంగళవారం జరిగిన బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది.


ఎంతలా అంటే వారు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేలా. అసలు ఏంటి మ్యాటర్ అంటే.. బిగ్ బాస్ లో మిగిలిన ఈ ఆరుగురికి ఎప్పుడు ఏదో ఒక టాస్క్ ఉంటూనే ఉంటుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన లక్సరీ బడ్జెట్ టాస్క్ లో బిగ్ బాస్ ఆంక్షల మేరకు ఫ్రీజ్, రిలీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, స్లో మోషన్ లాంటి టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.


ఇక ఇందులో భాగంగా శివ బాలాజిని ఫ్రీన్ చేసి మిగతా హౌజ్ మెట్స్ ను రిలీజ్ చేసి శివ బాలాజి భార్య మధుని బిగ్ బాస్ లో పంపించారు. ఇక ఆ ఎమోషన్ ఊహించాల్సిందే. ఆ తర్వాత ఆదర్శ్ వాళ్ల భార్య గుల్రాన్ ను లోపలకు పంపించారు. ఆదర్శ్ ఆమె వచ్చినప్పుడు ఫ్రీజ్ లో ఉండటం చూసి హౌజ్ మెట్స్ భోరున ఏడ్చేశారు. ఇక ఆ తర్వాత కన్ఫెషన్ రూం లో ఆదర్శ్ తన వైఫ్, కొడుకుని కలుసుకుని హౌజ్ మెట్స్ దగ్గరకు తీసుకొచ్చాడు.


నిజంగా ఈ ఎపిసోడ్ టివి చూస్తున్న వారిని కూడా హృదయం బరువెక్కేలా చేసింది. రోజు మనతో ఉండే భార్య పిల్లలు చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఉండే త్రిల్.. ఇంకా ఆ ఎమోషన్ వారెవా బిగ్ బాస్ అసలు హౌజ్ మెట్స్ అందరికి రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ షో మీద మంచి కిక్ వచ్చేలా చేస్తున్నాడు. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సర్ ప్రైజులు ఉంటాయో అని అందరు ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: