కన్నడ నాట హీరోలు ఒక్కొక్కరూ తమ అభిమానులని సరైన పథం లో నడపడం కొసం ప్రయత్నాలు చెయ్యడం అందరికీ నచ్చుతోంది. ఈమధ్యనే పుట్టిన రోజు జరుపుకున్న కిచ్చ సుదీప్ తన పుట్టిన రోజు ని చాలా సింపుల్ గా జరుపుకున్నాడు.


ఈ సందర్భంగా ఫాన్స్ ఎవ్వరూ డబ్బులు వేస్ట్ చెయ్యకుండా ఆ డబ్బులు అన్నీ దుబారా గా వేస్ట్ చెయ్యద్దు అని కోరుకున్నాడు. అదే పద్ధతి లో ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కోసం వెళుతున్నాడు.


ఈ నెల 18 న ఉపేంద్ర పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఫాన్స్ కేక్ లు కట్ చెయ్యడం తన ఫ్లేక్స్ లు ఏర్పాటు చెయ్యడం , పాలాభిషేకాలు , పూల దండలు వేయడం లాంటి ఖర్చులు పెట్టద్దు అని ఉపేంద్ర ఒక వీడియో ద్వారా ఫాన్స్ ని కోరుకున్నాడు.


అభిమానులు నేరుగా తన ఇంటికే వచ్చి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాలని ఉపేంద్ర చెప్పాడు. దీంతో, తమ అభిమాన హీరోను దగ్గరగా చూసే అవకాశం లభించనుండంటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: