మహేష్ బాబు ‘స్పైడర్’ కు అందరి ఊహలను తారుమారు చేస్తూ రోజురోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ టాక్ ఇండస్ట్రీ వర్గాలను మాత్రమే కాకుండా ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లకు కూడ షాక్ ఇస్తున్న నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి థర్డ్ పార్టీ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈమూవీ ఎగ్జిబిషన్ రైట్స్ కూడ చాల ఫ్యాన్సీ రేట్లకు ఆఫర్ వస్తున్నట్లు సమాచారం. దీనితో ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మాస్ మసాల సినిమాలకు భిన్నంగా ఈసినిమాను తీసిన మురగదాస్ స్టైల్ అందరికీ నచ్చుతుంది అని అంటున్నారు. 

ముఖ్యంగా ఈసినిమాలో మహేష్ ఎస్.జె.సూర్యాల మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలు ఈసినిమాకు హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. దీనికితోడు ఈమూవీ సెకండ్ ఆఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాను సూపర్ హిట్ రేంజ్ కి తీసుకువెళ్ళుతాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

దీనితో ఇప్పటి వరకు నెగిటివ్ టాక్ తో సతమతమైన ‘స్పైడర్’ యూటర్న్ తీసుకుని ఒకేసారి పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ తో పరుగులు తీస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు జూనియర్ మహేష్ సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీపడుతూ గతంలో మూడుసార్లు పోటీ పడినప్పుడు రెండుసార్లు మహేష్ పై చేయి సాధించిన సెంటిమెంట్ కూడ ‘స్పైడర్’ కలిసి వచ్చే అంశంగా మారుతోంది. 

ఇది చాలదు అన్నట్లుగా ఇప్పటి వరకు మెగా హీరోల భజన చేసే దర్శకుడు హరీష్ శంకర్ ‘స్పైడర్’ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ ట్విట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలలో ‘స్పైడర్’ ది బెస్ట్ గా మారే అవకాశం ఉంది అంటూ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులను మంచి జోష్ లో ముంచెత్తి వేస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: