మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పదునైన మాటలు రాయడంలోనే కాదు వ్యాపారంలో కూడ అందివేసిన చేయి అని నిరూపించుకునే విధంగా త్రివిక్రమ్ ఎత్తుగడలు ఉన్నాయి అంటూ ఫిలింనగర్ లో కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ సినిమాను త్రివిక్రమ్ తన సొంత బ్యానర్ లాంటి హారికా
హాసినీ క్రియేషన్స్ కు వచ్చేలా చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అన్న గాసిప్పులు ఎప్పటి నుంచో ఉన్నాయి.

ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈసినిమా నిర్మాత రాధాకృష్ణ చేత ఈసినిమాకు 100 కోట్లు పెట్టుబడి పెట్టించి ఇప్పుడు ఈసినిమా విడుదల కాకుండానే 30 కోట్ల లాభం వచ్చే విధంగా త్రివిక్రమ్ వ్యవహరించాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు ఇంకా భారీ బిజినెస్ జరిగే ఆస్కారం ఉన్నా త్రివిక్రమ్ దురాశ పడకుండా సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కాబట్టి  స్ట్రాంగ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఉండాలని వేరే ఏ సినిమాలు పోటీకి వచ్చినా దీనికి థియేటర్ల పరంగా లోటు రాకూడదని త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణతో చెప్పి ఈసినిమాకు అన్ని ఎరియాలలోను తలలు పండిన బయ్యర్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. 

దీనివల్ల ఈసినిమాకు లాభాల పరంగా కొంత పర్సంట్ ఆఫర్ తక్కువ వచ్చినా ఈసినిమా విడుదల అయ్యాక వచ్చే అడ్వాంటేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలని త్రివిక్రమ్ ఈసినిమా నిర్మాతకు మైండ్ వాష్ చేసినట్లు టాక్. దీనితో ఈసినిమాకు ఎన్నో ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను కాదని  టాప్‌ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఈ చిత్రాన్ని పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు టాప్ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఉన్న టాప్‌ క్లాస్‌ థియేటర్లు ఈసినిమాకు బ్లాక్ చేయడం జరిగితే ఒకవైపు సంక్రాంతి మ్యానియా మరొకవైపు పవన్ త్రివిక్రమ్ ల క్రేజ్ తో ఈమూవీకి సంక్రాంతి పండుగ హడావిడి పూర్తి అయ్యే సరికి కనీ వినీ ఎరుగని కలక్షన్స్ వచ్చే విధంగా త్రివిక్రమ్ ఇప్పటి నుంచే భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: