తనకు తెలిసినా తెలియక పోయినా నోటికి వచ్చినట్లు మాట్లాడటం తనకులేని విఙ్జానం ప్రదర్శించి అభాసుపాలు కావటం కొందరు కథానాయికలకు దినచర్యగా మారింది. కెనడా రాజధాని టోరంటో కేంద్రంగా జరిగిన "టోరంటో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌" వేదికపై తాను నయగారాలు పోతూ బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు ఎగుమతైన సరుకు ప్రియాంక చోప్రా కొన్ని హాస్యాస్పద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.


toranto international film festival priyanka chopra కోసం చిత్ర ఫలితం


"సిక్కిం ఈశాన్య భారతంలో ఒక బుజ్జి రాష్ట్రం. అక్కడ సినిమా పరిశ్రమ ఇప్పటివరకు లేదు. కనీసం సినిమాలు తీసేందుకు నిర్మాతలెవరూ కూడా ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ జరిగే తిరుగుబాట్లు, గందరగోళాలు, అల్లర్లే కారణం. అక్కడ అల్లర్లు చెలరేగుతూ ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద అనేక ఇబ్బందులకు ఓర్చుకొని తన తొలి "పహునా" అనే చిత్రాన్ని చిత్రీకరించాం అంటూ, సిక్కిం నుంచి వచ్చిన తొలిచిత్రం "పహునా" మాత్రమే అంటూ ప్రియాంక ఒకరకమైన హైపు క్రియేట్ చేస్తూ తమ కృషి, కష్టం గురించి అంతెత్తున చెప్పుకొచ్చారు. 



సంబంధిత చిత్రం


అయితే తను నిర్మాతగా మారి నిర్మించిన "పహునా" అనే చిత్ర కథ కూడా మంచి పట్టున్నదే. "సిక్కిం నుంచి ఇతర ప్రాంతాల కు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాల నేపధ్యంలో ఉద్వేగభరితంగా తెరకెక్కించారు. "పహునా"కు  'టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌' లో ప్రశంసలు బాగా దక్కాయి. ఆ అత్యుత్సాహం తో "సిక్కిం రాష్ట్రం అల్లర్లకు కేంద్రం" గా మారిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు అదీ ఒక అంతర్జాతీయ వేదికపై. ఇంకేం నెటిజన్లకు అవకాశం దొరికింది. అసలే ఆమె చెప్పిన కహానికి భగ్గుమన్న వాళ్ళు సెటైలకు తెరలేపారు.


ఇక సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చోప్రాపై తీవ్రస్థాయిలో విమర్శలు, హేళనలు, అవహేళన పర్వానికి తెరలెపారు. తన అక్కసు వెల్లగక్కుతున్నారు.  సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు ఆమెపై విరుచుకు పడగా, అసలు సిక్కిం ఎక్కడ ఉందో? ఎలా ఉంటుందో? ప్రియాంకకు తెలుసా? అంటూ మరి కొందరు సెటైర్ల తో ప్రశ్నిస్తున్నారు. సిక్కిం ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించిన నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నీ తెలిసిన వాళ్ళు ప్రియాంక ను మాటలతో వాయించే స్తున్నారు. 


pahuna movie కోసం చిత్ర ఫలితం



అసలు సిక్కిం చైనా భారత్ మద్య నలిగిపోతున్న తరుణం లో అంటే 1971 లోనే విశ్వవిఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రాయ్ "ఇరు దేశాల మద్య నలిగిపోతున్న లేగ దూడాలా ఉన్న్న సిక్కిం పై ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. దాన్ని భారత్ బాన్ చేసింది. కాని సిక్కిం భారత్ లో విలీనమైన తరవాత 1975 లో బాన్ ను తొలగించి ఆ సినిమాను కల్చర్ & టూరిజం శాఖకు అప్పగించారు. దాని క్వాలిటికి ఆశ్చర్య పోయిన బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానిని సంపాదించి అకాడమీ ఆఫ్ ఫిల్మ్ ఆర్చైవ్స్ లో భద్ర పరచారు. అంతటి చరిత్ర ఉన్న సిక్కిం సినిమా రంగాన్ని తన నోటి దూలతో కించపరచారు ప్రియాంక.     


అయితే సిక్కిం నుంచి ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలే వస్తున్నాయి. అందులో  "ప్రశాంత్‌ రసయిలి" లాంటి అద్భుత దర్శకుడు తీసిన రెండు మంచి సినిమాలు  "కాగ్బెని (కథ), ఆచార్య" కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం సిక్కిం సినీ పరిశ్రమ నుంచి "ధోక్బు" అనే సినిమా కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: