తెలుగు బుల్లితెర పై సంచలనాలు సృష్టించి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ను మరింత పెంచిన ‘బిగ్ బాస్’ షో జూనియర్ కు అన్ని విధాల కలిసి వచ్చింది అన్నది వాస్తవం. తారక్ వాక్ చాతుర్యం అతడి స్టార్ ఇమేజ్ ఈ షోకు కీలకంగా పనిచేసి మొదట్లో చాలమందిని ఆకర్షించని ఈషో చివరకు వచ్చే సరికి అందరికీ నచ్చిన రియాలిటీ షోగా మారిపోయింది.  

70 రోజుల పాటు జరిగే ఈ షో ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో ఈషో ముగియబోతున్న నేపధ్యంలో ఈ ‘బిగ్ బాస్’ షో విజేత ఎవ్వరు అనే ఆసక్తి, ఉత్కంఠ ప్రేక్షకుల్లో బాగా ఉంది. మరో వైపు ఈషో తొలి సీజన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. 

‘బిగ్ బాస్’ గ్రాండ్ పినాలే సమయంలో ఎన్టీఆర్‌తో పాటు మరో బిగ్ స్టార్‌‌ను ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్’ ఇంట్లోకి తాప్సీ, రానా, అల్లరి నరేష్, విజయ్ దేవరకొండ సునీల్ లాంటి స్టార్స్ వచ్చినా ఒక సూపర్ స్టార్ ను ఈ షో చివరి రోజు కార్యక్రమానికి పిలవాలని ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

ఈ షో గ్రాండ్ ఫినాలే సెప్టెంబర్ 24న జరగబోతున్న నేపధ్యంలో ‘స్పైడర్’ విడుదలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఖరి రోజు కార్యక్రమానికి మహేష్ బాబును ఆహ్వానించాలని నిర్వాహకులు జూనియర్ సూచన పై ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే తెలుగు, తమిళ భాషలలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న మహేష్ బాబు వచ్చేందుకు ఇంట్రస్టు చూపలేదని తెలుస్తోంది. 

మహేష్ బాబు ఇంట్రస్టు చూపక పోవడంతో ఇంకా తెలుగులో చాలా మంది స్టార్స్ ఉన్నారు వారిని సంప్రదించి చూడండి అని ఎన్టీఆర్ సూచించినట్లు టాక్. మహేష్ నిజంగానే బిజీగా ఉండి ఈ షోకు రావడం లేదా లేదంటే ఈ తిరస్కరణ వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: