మహేష్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పైడర్’ మూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరిగినా ఈసినిమాకు విడుదల కాకుండానే నిర్మాతలకు లాభాలు వచ్చినా కొన్ని భయాలకు సంబంధించిన వాస్తవాలు ఈసినిమా నిర్మాతలను భయపెడుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ‘స్పైడర్’ పై ప్రీ రిలీజ్ టాక్ ప్రస్తుతానికి బాగానే ఉన్నా ఫైనల్ గా ఈసినిమా విడుదలైన తరువాత ఈసినిమాలో కనిపించే తమిళ ఛాయలు ఎంతవరకు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అన్న భయం ఈసినిమా నిర్మాతలను బయ్యర్లను వెంటాడుతున్నట్లు టాక్.

అయితే ఈసినిమా కథ అంతా హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈమూవీలో అక్కడక్కడ తమిళ ఫ్లావర్ కనిపించినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు అన్న ధైర్యంలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసినిమా ఆడియోకు వచ్చిన మిశ్రమ స్పందన వల్ల ఈసినిమాను కొనుక్కున్న బయ్యర్లు ఈసినిమా నిర్మాతల నుండి మినిమం గ్యారెంటీ ఎగ్రిమెంట్ తీసుకున్న నేపధ్యంలో ఈమూవీ ఫలితం గురించి బిజినెస్ జరిగిపోయినా నిర్మాతలను కలవరపెడుతోంది అనిఅంటున్నారు. 

వాస్తవానికి ఈసినిమాకు వచ్చే ఓపెనింగ్స్ విషయంలో ఎటువంటి సందేహం లేకపోయినా ఈమూవీకి డివైడ్ టాక్ వస్తే మన తెలుగురాష్ట్రాలలోని బిసి సెంటర్లలోని ప్రేక్షకులు ఎంతవరకు ఈసినిమా పై మోజు పెంచుకుంటారు అన్నవిషయం కూడ కీలకంగా మారింది. ఇదిఇలా ఉండగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు జరుగుతున్న సందర్భంగా విడుదల కాబడ్డ ట్రైలర్ కు కూడ మిశ్రమస్పందన వస్తోంది. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి గత ట్రైలర్స్ కు భిన్నంగా ఏవో అద్భుతాలు ఉంటాయి అని భావించిన మహేష్ అభిమానుల అంచనాలకు భిన్నంగా లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కూడ సాదాసీదాగానే కనిపిస్తోంది అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు జిఎస్‌టి అమలుతో సినిమా షేర్లు గణనీయంగా తగ్గిపోయిన నేపధ్యంలో జిఎస్‌టి అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి తెలుగులో భారీచిత్రాలేవీ రిలీజ్‌ కాలేదు. 

ఈకొత్త విధానం అమలులోకి వచ్చిన తరువాత మహేష్ ‘స్పైడర్’ పై బయ్యర్లు భారీ మొత్తాలు పెట్టుబడి పెట్టినప్పటికీ  ఎగ్జిబిటర్లు మాత్రం మునుపటిలా దూకుడు చూపించడంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బి అండ్‌ సి సెంటర్స్‌ నుంచి వచ్చే ఫిక్స్‌డ్‌ హైర్లు రావడంలేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఎక్కువ  మంది మినిమం గ్యారెంటీ పద్ధతికే మొగ్గు చూపుతున్నారు అని టాక్. ఇలా అనేక సమస్యల మధ్య భారీ పోటీ మధ్య విడుదలవుతున్న ‘స్పదర్’ సక్సస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈమూవీకి మొదటి రోజు మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: