నారా రోహిత్ హీరోగా, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. ఈ సినిమా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చాలా రోజులు గ్యాప్ తీసుకుని థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇప్పటికే క‌థ‌లో రాజ‌కుమారి ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు వ‌చ్చిన టాక్ దిమ్మ‌తిరిగిపోయేలా ఉంది.

kathalo rajakumari కోసం చిత్ర ఫలితం

కథలో రాజకుమారి సినిమాలో రాజకుమారి తప్ప కథ లేదని మాట వినిపిస్తుంది. బేసిగ్గా నారా రోహిత్ సినిమా అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానులు చూడటానికి వెళ్తారు. నారా రోహిత్ వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటాడ‌న్న పేరుంది. సినిమాల మంచి కంటెంట్ ఉంటుంద‌న్న అంచ‌నాలు కూడా ఉంటాయి. అయితే ఈ సినిమా విష‌యంలో నారా రోహిత్ త‌న మార్క్  ఏ మాత్రం రిపీట్ చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చేశాయి. 


గ‌మ్యం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో రెండు గంట‌ల పాటు సినిమాను బాగా బోర్ కొట్టించేశార‌ట‌. అస‌లు మ‌హేష్ సూర‌ప‌నేని ఈ క‌థ‌తో ఎలా సినిమా తీశాడ్రా బాబూ అని సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్ష‌కులు త‌ల ప‌ట్టుకుంటున్న‌ట్టు కూడా స‌మాచారం. ఇక ఈ సినిమాలో మ‌రో కీ రోల్ చేసిన నాగ‌శౌర్య పాత్ర ఈ సినిమాకు గాని, అత‌డి కెరీర్‌కు గాని ఎలాంటి ఉప‌యోగం లేదు. 

kathalo rajakumari కోసం చిత్ర ఫలితం

గ‌తేడాది ఏడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆరు ప్లాప్‌లు ఎదుర్కొన్న నారా రోహిత్‌కు ఈ క‌థ‌లో రాజకుమారితో మ‌రో డిజాస్ట‌ర్ సినిమా అత‌డి అక్కౌంట్‌లో ప‌డింద‌న్న టాక్ ప్రీమియ‌ర్ షోల‌కే వ‌చ్చేసింది. టాక్ ముందే  అర్థ‌మైపోయి ఈ సినిమా ప్ర‌మోష‌న్ల మీద కూడా రోహిత్ పెద్ద‌గా కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేద‌ని కూడా స‌మాచారం. వ‌రుస ఫెయిల్యూర్స్‌తో రోహిత్ మార్కెట్ త‌గ్గ‌డంతో పాటు ఈ సినిమాకు క‌నీస ఓపెనింగ్స్ కూడా రావ‌ని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: