రామాయణ మహాకావ్యంలో లంకా సామ్రజ్య ప్రస్తావన ఎంత కీలకమో ‘జై లవ కుశ’ లో కూడ  లంకా పట్టణం వ్యవహారాలు కూడా అంతే ఆసక్తికరం అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు  ‘జై లవ కుశ’ లో కూడా లంకా పట్టణం ఉంది అని  టాక్. లంకా సామరాజ్యం అంతా రావణుడి ఆధీనంలో ఉన్నట్లుగా ‘జై లవ కుశ’ లో  కూడా లంకా పట్టణం ‘జై’ అధీనంలో ఉంటుంది.

ఈ సినిమా కధలో వచ్చే ట్విస్ట్ ల రీత్యా  లంకా సామ్రాజ్యాన్ని తలపించే ఆ ఊరిలోకి  లవ్ కుశ్ లు వెళ్ళి తమ పని చక్క బెట్టుకురావాలి. ఈ సినిమాలో వచ్చే ఈ ట్విస్ట్ చాలా కీలకం అని అంటున్నారు. దీనికితోడు ఈ సినిమా చివరి ఇరవై నిమిషాలు ఎన్టీఆర్ కెరీర్లో ది బెస్ట్ అనేటట్లుగా అతడి నటన ఉంటుంది అని అంటున్నారు. 

దీనికితోడు ఈసినిమాను చూసిన ప్రేక్షకులకు ఎన్టీఆర్ కు అలాంటి పాత్ర  ఇప్పట్లో రావడం కష్టం అనే భావన కలుగుతుంది అని అంటున్నారు. దీనికితోడు అందరూ ఊహిస్తున్నట్లు ‘జై లవ కుశ’ విషాదాంతమే అన్న అనుమానాలు వచ్చే విధంగా ఈ సినిమాకు సంబంధించిన లీకులు వస్తున్నాయి. సర్వసాధారణంగా టాప్ హీరోలు మూడు పాత్రలు వేసినపుడు ఒక పాత్రను చివరన ముగించడం అన్న సాంప్రయదాయాన్ని ఈ ‘జై లవ కుశ’ లో కూడ పాటించారు అన్న వార్తలు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. 

కన్ఫ్యూజ్ కామెడీ టెక్నిక్ ను రచయిత  కోన వెంకట్  ఈసినిమాలో పూర్తిగా వాడుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ  కన్ఫ్యూజ్ కామెడీ జనాననికి పూర్తి గా కనెక్ట్ అవ్వాలి అంటే ఆ సినిమాకు చాలా బలమైన స్క్రీన్ ప్లే ఉండాలి. అయితే ఈ స్క్రీన్ ప్లే విషయంలో ‘జై లవ కుశ’ తడపడింది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఏది ఏమైనా అసలు విషయాలు అన్నీ మరో 6 రోజులలో తెలిసిపోతాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: