తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘స్పైడర్’ ట్రైలర్ రానే వచ్చింది.   గత సంవత్సరం నుంచి ఊరిస్తూ...వస్తున్న మహేష్ బాబు ‘స్పైడర్’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ చాలా ఆలస్యంగా తీసుకు వచ్చారు.  దీంతో మహేష్ అభిమానులు దర్శకుడు మురుగదాస్ పై ఒకింత కోపంగా ఉన్న సందర్భంలో టీజర్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సందడి చేశారు.  

మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  ఈ చిత్రంలో మహేస్ బాబు జేమ్స్ బాండ్ తరహాలో నటించినట్లు సమాచారం. సినిమా కూడా హాలీవుడ్ స్థాయిలో పిక్చరైజ్ చేసినట్లు ట్రైలర్ లో చూస్తుంటే తెలుస్తుంది.  సినిమా కోసం చేసిన భారీ ఖర్చు తెరపై కనిపిస్తుందని మురుగదాస్ చెప్పిన మాట నిజమేననిపించేలా, ప్రతి ఫ్రేమ్ లోను రిచ్ నెస్ కనిపిస్తోంది.  

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.  ఈ చిత్రంలో టెర్రరిస్ట్ కార్యకలాపాల గురించి పోరాడే వ్యక్తిలా మహేష్ బాబు అద్భుతమైన నటన కనబర్చినట్లు కనిపిస్తుంది.  ఇక హాట్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ చాలా సెక్సీగా కనిపిస్తుంది.

ఇక విలన్ గా దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య కూడా అద్భుతమైన నటన కనబర్చినట్లు తెలుస్తుంది.  సాంగ్స్ ను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా అనిపిస్తోంది. డైలాగ్స్ చాలా సహజంగా అనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాదు, మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: