స్పైడర్ సినిమా ట్రైలర్ గత రాత్రి విడుదల అయ్యింది .. నిజానికి ఇవాళ సాయంత్రం విడుదల అవ్వాల్సిన ట్రైలర్ నిన్న రాత్రి 10 గంటల ప్రాంతం లో లీక్ అయ్యి , ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. రఫ్ వెర్షన్ వచ్చింది అసలు సిసలైన వెర్షన్ వేరే ఉంది అంటూ సినిమా బృందం లీకైన కాసేపటికి ప్రకటించి కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది.


అయితే లీక్ అయినా ట్రైలర్ , సినిమా బృందం విడుదల చేసిన ట్రైలర్ రెండూ ఒక్కటే అవ్వడం తో మహేష్ ఫాన్స్ సైతం ట్విట్టర్ లో గొడవ చేసారు. ఏదేమైనా ట్రైలర్ విషయం లో మిక్స్ టాక్ నడుస్తోంది.


ఈ సినిమా మీద మురుగదాస్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు తెలుగువాళ్ళు. కేవలం మహేష్ ఫాన్స్  మాత్రమే కాకుండా దాదాపు తెలుగు ప్రేక్షకులు అందరికీ ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి.


కానీ ట్రైలర్ కట్ మాత్రం చాలా పూర్ గా ఉంది. సెవెంత్ సెన్స్ సినిమాని గుర్తు చేస్తూ సాగింది ట్రైలర్ అంతా . టాక్ ఎలా ఉన్నా కూడా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా ట్రైలర్ దూసుకుని పోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: