మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో నిర్మించిన ‘స్పైడర్’ పై కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. నూట ఇరవై కోట్ల బడ్జెట్ నూట ముఫై కోట్లకు పైగా  బిజినెస్ జరిగిన ఈ  మూవీని దెబ్బతీసే ప్రయత్నం భయంకరంగా జరిగింది. అని అంటున్నారు. దీనికి కారణం ఈ మూవీ  ట్రయిలర్ విడుదలకు సరిగ్గా కొన్ని గంటల ముందుగా లీక్ కావడం అని అంటున్నారు. 

ఫిలిం నగర్ వినపడుతున్న వార్తల ప్రకారం లీక్ అయింది యూ ట్యూబ్ లింక్ కాదని నేరుగా విడియో కాపీనే అని అంటున్నారు. దీనితో ఈ లీక్   చెన్నై నుండి జరిగిందా లేదా  హైదరాబాద్ లోని ‘స్పైడర్’ ఆఫీస్ నుండి లీక్ అయిందా అనే విషయ మై భిన్న భిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  టాప్ హీరోల సినిమాలకు సంబంధించి లీక్ అవ్వడం అన్నది  కొత్త కాకపోయినా ఈ లీకులు ఎవరో కావల్లని చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ రోజు సాయంత్రం జరగబోతున్న ‘స్పైడర్’ ఫంక్షన్ రిలీజ్ కావలసిన ఈ ట్రైలర్ ముందుగానే లీక్ కావడంతో ఇప్పుడు ఆ ఫంక్షన్ లో కీలక ఘట్టం అయిన ట్రయిలర్ విడుదల అన్నది లేకుండా అయిపోయింది అని అంటున్నారు. దీనికితోడు ఒక పక్క  ఎన్టీఆర్ మహేష్ అభిమానుల మధ్య పోటీ భయంకరంగా ఉన్న నేపధ్యం లో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ట్రైలర్ కు కొటికి పైగా వ్యూస్ వచ్చిన పరిస్థితులలో ‘స్పైడర్’ లేటెస్ట్ ట్రైలర్ ను చూసి మహేష్ అభిమానులు కుడా పెదవి విరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘స్పైడర్’ మూవీకి ఇలా ఇన్ని సమస్యలు ఏర్పడటానికి గల కారణం మురగదాస్ అన్న భావన కూడ మహేష్ అభిమానులలో ఉంది తమిళ వెర్షన్ కూడా టేకప్ చేయడం మురుగదాస్ చెన్నైలో ఉండడంతో ప్రతీదీ చెన్నైలోనే రెడీ చేస్తున్నారు ఇందువలన ఈ సినిమా ప్రమోషన్ పై కంట్రోల్ తప్పింది అని మహేష్ అభిమానుల అభిప్రాయం. 
గతంలో ఇదే మితిమీరిన  విశ్వాసం వలన ‘ఆగడు’ ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్ అయిన  నట్లుగా  “స్పైడర్” కు కుడా ఆ  పరిస్థితి వస్తే గతి  ఏంటి?ఎంటి అని మహేష్ అభిమానులు మధన పదుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 అయితే కొత్తదనంతో కూడిన కధలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ప్రస్తుత అగ్ర హీరోలలో మహేష్ అందరి కంటే ముందు వరసలలో ఉండే నేపధ్యంలో ఈ ప్రయోగాలే మహేష్ కెరియర కు ఒకొక్క సందర్భంలో శాపంగా మారుతున్నాయి అని మహేష్ అభిమానులలో ఒక వర్గం అభిప్రాయపడుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: