పెద్దపెద్ద రచయితలు మేధావులు ఇళ్ళల్లో లక్షలు విలువ చేసే పుస్తకాలతో కూడిన లైబ్రరీ కనిపిస్తూ ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా కోట్లాది రూపాయల కార్లను ఇళ్ళను కలిగి ఉన్న అల్లు అర్జున్ కు సంబంధించి కోటి రూపాయల విలువగల లైబ్రరీ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. బన్నీ వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా’ కు సంబంధించిన న్యూస్ ఇది.

ఈమధ్యనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈమూవీలో ఈసినిమా కథకు సంబంధించి ఒక లైబ్రరీకి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉండటంతో దర్శకుడు వక్కంతం వంశీ దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఒక భారీ లైబ్రరీ సెట్ ను వేసి అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు టాక్. కోలీవుడ్ స్టార్స్  యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చాల వేగంగా జరుగుతోంది.

అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి చాల పక్కా వ్యూహంతో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీలో అల్లుఅర్జున్ లుక్ గెటప్ డైలాగ్ డెలవరీ అన్నీ కొత్తగానే ఉండటానికి  బన్నీ చాలా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఈ సంవత్సరం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథమ్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించని నేపధ్యంలో అల్లు అర్జున్ కోరుకుంటున్న 150 కోట్ల కలక్షన్స్ టార్గెట్ ను చేరుకునే విధంగా ‘నాపేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ను మార్చడానికి అల్లు అర్జున్ చాల కష్టపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: