తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్స్ అలరిస్తున్నారు..కానీ కొంత మంది మాత్రం హీరోలుగా మారి తమ సత్తా చాటారు.  గతంలో పద్మనాభం, రాజబాబు, చలం, బ్రహ్మానందం,ఆలీ లాంటి వారు కామెడీ పాత్రలు వేస్తూనే హీరోలుగా కొన్ని సినిమాల్లో నటించారు.  అయితే తనదైన కామెడీ టైమింగ్ తో తక్కువ కాలంలో అందరి మనసు దోచిన కమెడిన్ సునీల్.  లావుగా బొద్దుగా ఉండే సునీల్ ఒక్కసారే సన్నబడి సిక్స్ ప్యాక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.  హీరోగా మారిన సునీల్ మళ్లీ కామెడీ పాత్రలు వేయడం లేదు.  
Image result for ungarala rambabu
గత కొంత కాలంగా సునీల్  సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇక ఉంగరాల రాంబాబు సినిమా విషయానికి వస్తే..చిన్నప్పటి నుంచి అమాయకంగా భయస్తుడిగా ఉన్న ఓ కుర్రోడు తాతయ్య చెప్పిన వీరగాధలు విని ఇన్సిప్రేషన్ చెంది ధైర్యవంతుడు అవుతాడు.  ఇక ఓ ట్రావెల్ ఏజెన్సీ మెయింటేన్ చేసే సునీల్ ప్రతివిషయంలోనూ ఇన్స్ ప్రేషన్ కలిగితేనే ఎంతో పనైనా చేయడానికి పూనుకుంటాడు.  ఈ నేపథ్యంలో బాదం బాబా మాటలు వేదవాక్కులే భావించే రాంబాబు జీవితంలో అన్నీ కోల్పోయి తకు లక్ ఎలా కలిసి వస్తుందని బాదం బాబాను అడిగితే..ఓ అమ్మాయి ద్వారా అని చెబుతాడు.
Image result for ungarala rambabu
అప్పటి నుంచి తన ఆఫీస్ లో పనిచేసే హీరోయిన్ లవ్ పొందడానికి నానా తంటాలు పడుతుంటాడు.  ఇక హీరోయిన్ ఓ గ్రామంలో పేదల కోసం పోరాడే వ్యక్తి కూతురు..ఆయనే ప్రకాశ్ రాజ్.  అయితే ప్రకాశ్ రాజ్ కి మొదట్లో సునీల్ నచ్చకపోవడం..అతని మనసు ఎలా గెలిచాడో అన్న విషయంలో సునీల్ చాలా అద్భుతంగా నటించాడనే చెప్పొచ్చు.  గత కొంత కాలంగా సీరియస్ పాత్రలను నమ్ముకొని ఇబ్బందులు పడ్డ సునీల్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి హావభావాల్లోనూ కామెడీ పండించడానికి తెగ కష్టపడినట్టు కనిపిస్తుంది.  
Image result for ungarala rambabu
హీరోయిన్ మియా జార్జ్ కూడా  సాంప్రదాయంగా కనిపిస్తూ.. మంచి నటనతో మెప్పించింది. సునీల్ రాంబాబు పాత్రలో తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.  ప్రకాశ్ రాజ్ సినిమాలో కమ్యునిస్ట్ గా రైతుల కోసం పోరాడే వ్యక్తిగా బాగా నటించాడు. కొన్ని డైలాగ్స్ కూడా బాగా పేలాయి. పోసాని, వెన్నెల కిశోర్ లాంటి వారు కూడా బాగా నటించారు. దర్శకుడిగా క్రాంతి మాధవ్ విఫల ప్రయత్నమే అని చెప్పాలి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది.. గిబ్రాన్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు.  ఇక సినిమాపై మిశ్రమ స్పందనే వస్తుంది..మరి రేపటి వరకు ఈ సినిమా హిట్టా..ఫ్లాపా అన్న విషయం తెలిసిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: