సీనియర్ స్టార్ అంతా విలన్ గా కొత్త టర్న్ తీసుకుంటున్న ఈ తరుణంలో యాక్షన్ కింగ్ అర్జున్ లై సినిమాతో విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అందుకే ఈసారి చేస్తున్న సినిమా మీద మరింత ఫోకస్ పెట్టాడు అర్జున్. ఇంతకీ అర్జున్ విలన్ గా చేస్తున్న మరో సినిమా ఏంటి అంటే అదే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య.


రచయిత వక్కంతం వంశీ డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో బన్ని ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతుండగా అందులో విలన్ గా అర్జున్ తన సత్తా చాటనున్నాడు. లై తో నిరాశ చెందిన అర్జున్ ఈ సినిమాలో కచ్చితంగా కీలకంగా మారబోతున్నాడట. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.


లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతగా మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మరి అర్జున్ వర్సెస్ అర్జున్ ఫైట్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది చూడాలంటే 2018 ఏప్రిల్ 27 దాకా వెయిట్ చేయాల్సిందే. సమ్మర్ లో సత్తా చాటడానికి వస్తున్న బన్ని కచ్చితంగా తన హిట్ మేనియా కంటిన్యూ చేస్తాడని అంటున్నారు.


అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు శరత్ కుమార్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. అర్జున్ విలన్ గా చేస్తున్న ఈ సెకండ్ మూవీ అయినా అతనికి సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి. సినిమా కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న అర్జున్ ఫలితం ఎలా అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: