తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరమాం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలను పక్కనబెట్టి మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తన తనయుడు రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమా రిమేక్ గా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు.  అప్పటి వరకు చిరంజీవి స్టామినాపై రక రకాలుగా వస్తున్న రూమర్లను పటాపంచలు చేశారు చిరంజీవి.  పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ లో ఎలా ఉన్నారో..ఇప్పుడూ అలాగే ఉన్నారు..ఆయనలో పవర్..గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని..బాస్ ఈజ్ బ్యాక్ అని బ్రహ్మరథం పట్టారు.  
రహమాన్‌ సైరా వర్క్‌ స్టార్‌ చేశాడు
ప్రస్తుతం చిరంజీవి తన 151వ చిత్రం కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నారు.  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు.  మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా రెగ్యులర్‌  ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయని మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. మొదట ఈ చిత్రానికి థమన్‌ని సంగీత దర్శకుడు అనుకున్నారు.
Image result for saira narasimha reddy
'సైరా..' మోషన్ పోస్టర్ కూడా థమన్ రీ-రికార్డింగ్‌తోనే విడుదలైంది. కానీ పోస్టర్ పై మాత్రం ఏఆర్ రెహమాన్ ఉండటంతో అందరూ సందగ్ధంలో పడ్డారు..ఇంతకీ ‘సైరా’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా అని.  అయితే ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ ని కాదని ఏ ఆర్ రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు కట్ చేస్తే బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాను కాబట్టి ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించలేను అందుకే నా స్థానంలో మరొకరిని పెట్టుకోండి అని చెప్పాడట ఏ ఆర్ రెహమాన్ .
Image result for thaman ss
కాకపోతే రహమాన్‌ సైరా నుండి తప్పుకున్నాడు అంటూ ప్రచారం మరి రహమాన్ డ్రాప్ విషయంపై నిజా నిజాలు 'సైరా.. ' యూనిట్ తేల్చాల్సివుంది.సోషల్‌ మీడియాలో రెహమాన్ తప్పుకుంటున్నాడూ అంటూ వచ్చిన ప్రచారానికి మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  మరోవైపు ‘సైరా నరసింహారెడ్డి' సినిమాకు ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే సినిమాకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్‌ చేశారని చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా ఆ వార్తను కొట్టి పారేశారు. దాంతో ఫ్యాన్స్‌ కాస్త రిలాక్స్‌ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: