తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబో అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.   ఇక పవర్ స్టార్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది..ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పవన్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు.  అయితే సినిమా పేరు మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ గానే కొనసాగుతుంది. కాకపోతే సినిమా లో పవన్ చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నారు.
Related image
ఈ చిత్రంలో హీరోయిన్ గా మళియాళ భామ కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక సినిమా టైటిల్ విషయంలో ఇంకా తర్జన భర్జన జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ తయారు చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  పవన్ నటిస్తున్న ఈ సినిమా అజ్ఞాత వాసి పేరు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఆ మద్య టాక్ వచ్చింది.
Related image
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ని అనుకోవడం జరుగుతుంది అయితే తాజాగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్ పోస్టర్ ని డిజైన్ చేసిన తీరు బాగుండటం తో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజ్ఞాత వాసి అనే టైటిల్ ని డిజైన్ చేసి అత్తారింటికి దారేది చిత్రంలోని స్టిల్  గ్రాఫిక్ లో బాగా సెట్ చేశారు.  

పవన్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన జల్సా , అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ డూపర్ హిట్ లు కావడంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనే టైటిల్ తో పోస్టర్ ఉండేసరికి ఫ్యాన్స్ సంతోషానికి అంతే లేకుండా పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: