ఈ దసరా రేస్ జూనియర్ మహేష్ ల ఆధిపత్య పోరుగా మారిపోవడంతో ‘జై లవ కుశ’ ‘స్పైడర్’ సినిమాల రిజల్ట్ గురించి ఫిలిం ఇండస్ట్రీతో పాటు వారి అభిమానులు కూడ అత్యంత ఆసక్తితో ఈ వార్ ఫైనల్ రిజల్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో యంగ్ హీరో శర్వానంద్ కు సంబంధించిన ‘మహానుభావుడు’ మూవీ విడుదల కాకుండానే మహేష్ జూనియర్ ల సినిమాల పై మొదటి విజయాన్ని విడుదల కాకుండానే నమోదు చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

దసరా రేస్ మధ్య శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమా విడుదల అవ్వడం ఒక ఆశ్చర్యం  అయితే ఈసినిమా ఆడియోకు వస్తున్న స్పందన మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈమధ్య కాలంలో కాపీ సంగీత దర్శకుడుగా తన ఇమేజ్ ని పోగొట్టుకున్న ఎస్.ఎస్. థమన్ స్వరపరిచిన ‘మహానుభావుడు’ పాటలకు మంచి స్పందన రావడమే కాకుండా ఆ పాటలు యూత్ కు బాగా కనెక్ట్ కావడం అత్యంత సంచలనంగా మారింది.

దీనితో ‘జై లవ కుశ’ ‘స్పైడర్’ సినిమాల ఆడియోల కంటే ‘మహానుభావుడు’ పాటలు బాగున్నాయి అన్న కామెంట్స్ రావడం జూనియర్ మహేష్ సినిమాలను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లకు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. దీనికితోడు ఇప్పటికే సంక్రాంతి పండుగ హీరోగా రెండు సార్లు తన సత్తాను చాటుకున్న శర్వానంద్ ఈసారి దసరా హీరోగా కూడ మారిపోతాడా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.

ఇది ఇలా ఉండగా మొత్తం 6 పాటలు ఉన్న ‘మహానుభావుడు’ ఆడియో ఆల్బంలో అన్ని పాటలు వినసొంపుగా ఉండటం అందరికీ షాక్ ఇచ్చే విషయంగా మారింది. దీనితో ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అవుతున్న ‘మహానుభావుడు’ షాక్ మహేష్ జూనియర్ లకు ఎంతోకొంత స్థాయిలో తగులుతుందా అన్న విషయమై ఊహాగానాలు మొదలు అయిపోయాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల ఊహించని ఘన విజయాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్న నేపధ్యంలో ఈ మహానుభావుడు ఎటువంటి షాక్ ను ఇస్తుంది అన్న అంచనాలు పెరిగిపోతున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: