“అర్జున్ రెడ్డి”  సినిమాతో టాప్ డైరెక్టర్స్ దృష్టిలో పడిన సందీప్ రెడ్డితో సినిమాలు చేయడానికి చాలమంది ఆసక్తి కనపరుస్తూ సంకేతాలు పంపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్టులో ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నట్లు వార్తలు రావడమే కాకుండా ఒక మంచి కధను మహేష్ కోసం రెడీ పెడుతున్నట్లుగా ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.   

ఇప్పుడు ఈ వ్యవహారమే త్రివిక్రమ్ ప్రిన్స్ ను డిస్ట్రబ్  చేస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమాను చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ తో చేస్తున్న సినిమా పూర్తి  అయిన తరువాత వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి జూనియర్ తో ఒక సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. 

అయితే ఈమూవీ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత త్రివిక్రమ్ వచ్చే ఏడాది చివరిలో మహేష్ తో ఒక సినిమా తీయడానికి ప్రాధమిక చర్చలు కూడ పూర్తి అయ్యాయి అన్న వార్తలు ఉన్నాయి. అయితే అన్నీ కుదిరితే వచ్చేఏడాది చివరి నుండి మహేష్ సందీప్ రెడ్డిల సినిమా ఉండటం ఖాయం అని అంటున్నారు. 

ఆ సమయానికి మహేష్ వంశీ పైడిపల్లి మూవీ ప్రాజెక్ట్ నుండి కూడ బయటకు వస్తాడు కాబట్టి సందీప్ రెడ్డికి మహేష్ డేట్స్ దొరకడం పెద్ద కష్టం కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో మహేష్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. 

దీనితో  ‘శ్రీమంతుడు’ ప్రొడ్యూసర్స్ మైత్రీమూవీ మేకర్స్ సంస్థతో త్రివిక్రమ్ చేయవలసిన సినిమాలో సందీప్ రెడ్డి వచ్చి చేరడం ఖాయం అని అంటున్నారు.  ఈ వార్తల పై ప్రస్తుతానికి ఒక క్లారిటీ లేక పోయినప్పటికే ఇటువంటి వార్తలు రావడం ఒక విధంగా  త్రివిక్రమ్ కు ఊహించని పరిణామం అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: