కమెడియన్ టర్డ్న్ హీరో సునీల్ హీరోగానే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కథనాయకుడిగా మారిపోయిన సునీల్ ని కమెడియన్ పాత్రలకు అడగడం కూడా మానేశారు. అయితే హీరోగా చేసిన చిత్రాల్లో అన్ని సక్సెస్ కాలేదు. దీంతో కెరీర్ ని భారంగా నెట్టుకొస్తున్నాడు సునీల్.


ఉన్నట్లుండి సునీల్ తన ఆలోచన విధానం మార్చుకున్నాడని టాక్. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు కమెడియన్ పాత్రల్లో కనిపించాలని డిసైడ్ అయ్యాడు. అలాగే విలన్ క్యారెక్టర్లు కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. అంటే ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకూడదని డిసైడ్ అయ్యాడన్న మాట. 


ఇక సునీల్ కి మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 'సైరా నర్సింహా రెడ్డి' చిత్రంలో అవకాశం దక్కింది. తనకు ఈ అవకాశం రావడం పట్ల ఆనందంగా ఉందని తెలిపాడు. వాస్తవానికి 150 చిత్రంలోనే చేయాల్సి ఉందన్నాడు. కాని కుదరకపోవడం వల్ల ఈ చిత్రంలో చేస్తున్నానని చెప్పాడు. 


రీసెంట్ గా వచ్చిన సునీల్ ఉంగరాల రాంబాబు కూడా అంట మంచి టాక్ ఏమి తెచ్చుకోలేదు. ఓపెనింగ్స్ మాములుగానే ఉన్నా సినిమా సునీల్ కు కాస్త పాజిటివ్ ఫీలింగ్ తెచ్చిందని తెలుస్తుంది. ఇదే ఉత్సాహంతో ఇక మళ్ళీ సునీల్ కమెడియన్ గా కనిపించి జనాన్ని కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నాడన్న మాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: