జూనియర్ ను టార్గెట్ చేస్తూ కొందరు వేస్తున్న సెటైర్లు ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న ‘జై లవ కుశ’ ను ప్రమోట్ చేస్తూ నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ తాను ఈసినిమా కోసం పడ్డ కష్టాలను వివరిస్తూ చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం కొన్ని సెటైర్లు హడావిడి చేస్తున్నాయి. 

తాను ‘జై’ పాత్ర గురించి ఆలోచిస్తూ చాల రోజులు తన ఇంటిలో ఏకాంతంగా గడిపిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఒకరోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు తన ‘జై’ పాత్ర గురించి ఆలోచిస్తూ తన గదిలోని కిటికీ దగ్గర తన ‘జై’ పాత్ర గురించి ఆలోచిస్తూ ఒక విచిత్ర పరిస్థితులో ఉన్న అప్పటి తన పరిస్థుతులను గుర్తుకు చేసుకున్నాడు. అయితే అప్పుడు తన భార్య పట్టుకుని వెనక్కు లాగే వరకు తాను ‘జై’ పాత్ర మ్యానియాలోనే ఉండిపోయాను అంటూ అలా కొంత సేపు అదే పరిస్థితిలో కొనసాగితే తనకు ఆరోజు ప్రమాదం జరిగి ఉండేది అన్న విషయాన్ని బయట పెట్టాడు.

అయితే ఈ విషయాలను జూనియర్ నోటి వెంట విన్న కొందరు జూనియర్ వ్యతిరేకులు మాత్రం జూనియర్ ను టార్గెట్ చేస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘సెట్లో నటించండి రా అంటే ఇంటర్వ్యూలో కూడ చేస్తున్నారు మన స్టార్స్’ అంటూ కొందరు జూనియర్ మాటలకు విపరీత అర్ధాలు తీస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఈ సెటైర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 

ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కూడ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. రాబోతున్న 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పాత్ర గురించి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలి అని ఎవరు ప్రయత్నించినా అది స్వాగతింప దగ్గ విషయం అని అంటూ పవన్ అభిమానుల మెప్పును కూడ పొందడానికి ప్రయత్నించాడు. ఏది ఎలా చూసినా జూనియర్ మాటలలో ఇది వరకటి దూకుడు తగ్గి ప్రతిమాటలోను ఆచితూచి మాట్లాడటం జూనియర్ లో వచ్చిన మార్పుకు సంకేతంలా కనిపిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: