మహేష్ బాబు సినిమా కథల ఎంపిక నుండి ఆ సినిమాల ప్రమోషన్ వరకు నమ్రత వ్యూహాలు బాగా ప్రభావితం చేస్తాయి అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ కెరియర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులు సృష్టించిన ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ ను అంతా నమ్రత దగ్గర ఉండి చూసుకోవడమే కాకుండా ఆ సినిమా ఘన విజయంలో తన వంతు పాత్రను చాల విజయవంతంగా పోషించింది. 

అటువంటి నమ్రత ‘బ్రహ్మోత్సవం’ ఫెయిల్యూర్ తరువాత ఎంతో గ్యాప్ తీసుకుని విడుదల అవుతన్న మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’ ప్రమోషన్ విషయాల గురించి నమ్రత పట్టించుకోకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు దర్శకుడు మురగదాస్ ‘స్పైడర్’ ప్రమోషన్ విషయంలో వెనక పడ్డాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

వాస్తవానికి ఎన్నో ముంబాయికి చెందిన యాడ్ ఎజన్సీస్ తో సన్నిహిత సంబంధాలుగల నమ్రత ‘స్పైడర్’ విషయంలో చాల వినూత్నమైన పబ్లిసిటీ చేయిస్తుంది అన్న అభిప్రాయం మహేష్ అభిమానులలో ఉంది. ఆమె మహేష్ సినిమాల ప్రమోషన్ ను చేపడితే  ఎటువంటి పొరపాటు లేకుండా అంతా తానే స్వయంగా పర్యవేక్షిస్తు మీడియా సంస్థలను మేనేజ్ చేయగల సమర్ధత నమ్రతకు ఉంది. 

అయితే అటువంటి నమ్రతను మహేష్ కావాలని ‘స్పైడర్’ విషయంలో దూరం పెట్టాడా ? లేదంటే ఈ ఎత్తుగడ వెనుక మరేమైనా వ్యూహాలు ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.  అయితే మహేష్ సన్నిహితులు మాత్రం త్వరలోనే నమ్రత రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారని టాక్. 

అంతేకాదు మహేష్ నటించిన గత చిత్రాల్లా కాకుండా ఈ చిత్రం పబ్లిసిటీ విభిన్నంగా చేయడానికి ఇప్పటికే ఒక ప్రముఖ యాడ్ సంస్థతో చర్చలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. వార్తలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం మరో 10 రోజులలో విడుదల కాబోతున్న ‘స్పైడర్’ తన పబ్లిసిటీ విషయంలో చాల వెనకపడి ఉంది అన్న అభిప్రాయం మహేష్ అభిమానులలో తీవ్ర స్థాయిలో కలవర పెడుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: